Friday, February 20, 2026
Homeహైదరాబాద్‌Aadab Calender | ‘ఆదాబ్’ క్యాలెండర్ ఆవిష్కరణ

Aadab Calender | ‘ఆదాబ్’ క్యాలెండర్ ఆవిష్కరణ

జవహర్ నగర్, జనవరి 23(ఆదాబ్ హైదరాబాద్): గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(GHMC) పరిధిలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్‌(Jawahar Nagar Police Station)లో ఆదాబ్ హైదరాబాద్ తెలుగు దిన పత్రిక(Aadab Hyderabad News Paper) నూతన (2026వ) సంవత్సరం క్యాలెండర్‌(New Year Calender)ను ఎస్‌హెచ్ఓ సైదయ్య శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సైదయ్య మాట్లాడుతూ.. పత్రికలు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉండాలన్నారు. జర్నలిజాన్ని (Journalism) కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఎస్ఐ రాము, ఎస్సైలు ఇద్రిస్ అలీ, లక్ష్మయ్య, వెంకట్ రెడ్డి, ఆదాబ్ హైదరాబాద్ దిన పత్రిక రిపోర్టర్ గంగాధర్ చారి పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News