- తహసీల్దార్ వెంకటేశ్వర్లు
- ఘనంగా ఆదాబ్ 2026 క్యాలెండర్ ఆవిష్కరణ
సంచలన వార్త కథనాలను నిర్భయంగా ప్రచురిస్తూ ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక ప్రజల మన్ననలను పొందుతుందని నేలకొండపల్లి తహసీల్దార్ వెంకటేశ్వర్లు అన్నారు. తహసీల్దార్ కార్యాలయంలో శనివారం ఆదాబ్ హైదరాబాద్ రూపొందించిన నూతన సంవత్సరం 2026 క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలను చైతన్యవంతం చేస్తూ, ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక పని చేస్తుందని తెలిపారు.
సమాజంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను, సమగ్ర సమాచారాన్ని రాజీ లేకుండా అందరికంటే ముందుగా ప్రజలకు అందించడంలో ఆదాబ్ హైదరాబాద్ సఫలీకృతమైందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ కనకం నరసింహారావు, ఆదాబ్ పాత్రికేయులు గోవింద వెంకట్, గిర్దావర్ లు మదుసూదన్, రవికుమార్, డీలర్ బట్టపోతుల కిరణ్, ఎల్లుట్ల సైదులు, కార్యాలయ సిబ్బంది చిర్ర నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.
