జవహర్ నగర్, జనవరి 23(ఆదాబ్ హైదరాబాద్): ప్రజల సమస్యలపై నిత్యం స్పందిస్తూ.. అవినీతి, అక్రమాలను నిర్భయంగా వెలికితీస్తూ ఆదాబ్ హైదరాబాద్(Aadab Hyderabad) దిన పత్రిక(News Paper) పాఠకుల మన్ననలు పొందుతోందని కాప్రా తహశీల్దార్(Kapra Tahsildar) బైరెడ్డి రాజేష్ అన్నారు. శుక్రవారం తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో దిన పత్రిక నూతన సంవత్సర (2026) క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు(Calendar Unveiled).
ఈ సందర్భంగా తహశీల్దార్ రాజేష్ మాట్లాడుతూ.. ఉద్యమంలో పుట్టి నిజాలను వెల్లడిస్తూ యావత్ తెలంగాణ ప్రజల మనసులో ఆదాబ్ హైదరాబాద్ దినపత్రిక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర ఎంతో కీలకమని, పాత్రికేయులు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా నిలవాలని సూచించారు. ఆదాబ్ హైదరాబాద్ దిన పత్రిక మరింత అభివృద్ధి సాధించి ప్రజల విశ్వాసాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ బైరెడ్డి రాజేష్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు రమేష్, సత్యనారాయణ, తహశీల్దార్ కార్యాలయ సిబ్బంది, పాత్రికేయులు మార్కండేయ, గౌరీ శంకర్, శంకర చారి, నరసింహా చారి, ప్రశాంత్, జవహర్ నగర్ ఆదాబ్ హైదరాబాద్ రిపోర్టర్ గంగాధర్ చారి తదితరులు పాల్గొన్నారు.
