Friday, October 3, 2025
ePaper
Homeఆదాబ్ ప్రత్యేకంNalgonda | నల్లగొండ డైట్ పాఠశాలలో ఏం జరుగుతోంది..?

Nalgonda | నల్లగొండ డైట్ పాఠశాలలో ఏం జరుగుతోంది..?

  • బి.ఈడీ ట్రైనింగ్ విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఓ ఉపాద్యాయుడు!
  • తన కోరిక తీరిస్తే, బి.ఈడీ పాస్ చేయిస్తానని ప్రపోజల్ చేసిన కీచకుడు..
  • ఒంటరి మహిళ అని తెలుసుకొని వేధించిన వైనం..
  • గతంలో ఇదే పాఠశాలలోని ఆడపిల్లలను వేధించిన ఘటనను బయట పెట్టిన ‘ఆదాబ్’
  • ఆరు నెలలు సస్పెండ్ అయి.. మళ్ళీ ఇదే పాఠశాలకు తిరిగొచ్చిన తీరు జిల్లా విద్యాశాఖకు అద్దం పడుతోంది
  • నల్లగొండ డైట్ పాఠశాల కీచక ఉపాద్యాయుని రంకు బాగోతం పై ‘ఆదాబ్’ ప్రత్యేక కథనం..

రాను రాను రాజు గుర్రం గాడిదైనట్లు.. రోజు రోజుకు విద్యావంతులు విన యం, శీలం కోల్పోతున్నారు. ఇది నేటి సమాజంలో ఉన్న ఒక చేదు వాస్తవం. విద్య అంటే కేవలం పుస్తకాల జ్ఞానం మాత్రమే కాదు, అది మనిషి ఆలోచన, ప్రవర్తన, నైతికత, వినయం పెంపొందించాల్సిన ఒక అద్భుతమైన సాధనం. కానీ, నేటి పరిస్థితుల్లో చదువుకున్న కొంతమంది వ్యక్తులు అహంకారానికి లోనై, వికారపు పనులు చేస్తున్నారు. పూజలు అందుకోవాల్సిన కొంతమంది గురువులు విద్యార్థులచేత ఛీకొట్టబడుతున్నారు.

నల్లగొండ డైట్ పాఠశాలలో ఉపాద్యాయుడి దురాగతం..!
బి.ఈడ్ విద్యార్థినిపై అనుచిత ప్రవర్తన- జిల్లా విద్యాశాఖను ప్రశ్నిస్తున్న ఘటన

నల్లగొండ జిల్లా డైట్ పాఠశాలలో మరోసారి ఉపాద్యాయుడి రంకు బాగోతం బయటపడింది. బి.ఈడి ట్రైనింగ్ చేస్తున్న ఓ విద్యార్థినిపై అనుచితంగా ప్రవర్తిస్తూ, నా కోరిక తీరిస్తే, బి.ఈడీ పాస్ చేయిస్థానని 59 ఏళ్ల వయస్సు ఉన్న ఓ కీచక ఉపాధ్యాయుడు ఆమెకు ప్రపోజల్ చేసినట్టు తెలుస్తోంది. వివాహిత అయిన ఒంటరి మహిళ అని తెలుసుకొని వేధింపులకు పాల్పడిన ఆ ఉపాధ్యాయుడు గతంలో కూడా ఇదే పాఠశాలలోని పలువురు విద్యార్థినులకు ముద్దులు పెట్టడడం, వారితో వెకిలి చేష్టలు చేయడంతో విద్యార్థినులు వెళ్లి వారి తల్లిదండ్రులకు చెప్పడంతో వారు డైట్ పాఠశాలకు వచ్చి, భాద్యులైన ఇద్దరు ఉపాధ్యాయులకు దేహశుద్ది చేశారు. ఈ సంఘటన గురించి గత ఏడాది మార్చి 5న ‘ఆదాబ్’ బ్యానర్ వార్తను ప్రచురించింది. ఆ వివరాలు వెలుగులోకి రాగానే ఆరు నెలలు సస్పెన్షన్ కు గురైన అతన్ని ఇదే పాఠశాలలో తిరిగి కొనసాగించడం జిల్లా విద్యాశాఖ నిర్లక్ష్యాన్ని బహిర్గతం చేస్తోంది.

ప్రజల ప్రశ్నలు :

  • ఇంతకుముందు శిక్ష అనుభవించిన ఉపాధ్యాయుడిని తిరిగి అదే పాఠశాలలో ఎందుకు నియమించారు?
  • విద్యార్థినుల భద్రత పట్ల విద్యాశాఖ ఎంతవరకు శ్రద్ధ చూపుతోంది?
  • మహిళలపై వేధింపులు జరిగిన చోట తక్షణ చర్యలు తీసుకోవాల్సింది పోయి, అదే వ్యక్తికి మళ్లీ అవకాశం ఇవ్వడం వెనుక ఎవరైనా ప్రభావశీలుల మద్దతా ఉంది?

బాధిత విద్యార్థిని ధైర్యంగా స్వరం ఎత్తిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు నల్లగొండ డైట్ పాఠశాలలోని వాతావరణం, విద్యార్థినుల భద్రతా ప్రమాణాలు, అధికారుల నిర్లక్ష్యం ఇక్కడ ఒక చర్చనీయాంశంగా మారాయి. విద్యార్థినుల భవిష్యత్తుతో ఆడుకునే కీచక ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, విద్యార్థి సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఒక వ్యక్తిగత ఘటన కాదు, ఈ పాఠశాలలో గతంలో కూడా ఇలాంటి ఫిర్యాదులు నమోదైన విషయమే ఈ కేసును మరింత సీరియస్గా నిలబెడుతోంది. జిల్లాకు కలెక్టర్గా ఒక మహిళా అధికారి ఉన్న చోట సాటి మహిళలకు ఇలాంటి సంఘటనలు ఎదురుకావడం శోచనీయం.

YouTube player

కలెక్టర్ ఈ విషయం లో కాస్త చొరవ చూపి, నల్లగొండ డైట్ స్కూల్లో జరుగుతున్న ఈ ఉపాద్యాయుడి దురాగతంపై లోతైన అంతర్గత విచారణ జరిపితే, ఊహించని వాస్తవాలు ఇంకా ఎన్నో వెలుగుచూసే అవకాశం లేకపోలేదు. సదరు కామాంధ ఉపాద్యాయుడు ఇక్కడ పనిచేస్తున్న తన తోటి మహిళా టీచర్లను సైతం వదలడం లేదని వినికిడి. మహిళా టీచర్లు ధరించే వారియొక్క రోజు వారి చీరలు, బ్లౌజులపై కూడా సెటైర్లు వేస్తూ వేధిస్తున్నట్లు తెలుస్తోంది.

విద్యాశాఖ వైఖరి ప్రశ్నార్థకం..

విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన డైట్ పాఠశాలల్లోనే ఇలాంటి సంఘటనలు జరగడం పాలనా వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు కలిగిస్తోంది. జిల్లా విద్యాశాఖ అధికారులు ఇప్పటివరకు నిశ్శబ్దం పాటించడం మరింత ఆగ్రహానికి దారి తీస్తోంది. బాధితురాలి వాంగ్మూలం రికార్డు చేసి, భవిష్యత్తులో మరే విద్యార్థినీ ఇలాంటి వాతావరణంలో ఉండకుండా చూడాలి. నల్లగొండ డైట్ పాఠశాలలో బయటపడిన ఈ ఘటన ఒక వ్యక్తి దుర్వ్యవహారం మాత్రమే కాదు, మొత్తం విద్యా వ్యవస్థలోని లోపాలకు ఇది ఒక ప్రతిబింబం. ఇకనైనా అధికారులు మేలుకొని చర్యలు తీసుకుంటారా..? లేక మళ్లీ పాత ఆటను కొనసాగిస్తారా..? వేచి చూద్దాం..!

RELATED ARTICLES
- Advertisment -

Latest News