హైదరాబాద్ జిల్లా కలెక్టర్, డీఈవో చొరవ
పాఠశాలకు పెయింటింగ్ ప్రారంభం
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ (Hyderabad District Collector) చొరవతో నగరంలోని ఇండియన్ రెడ్‌క్రాస్ గర్ల్స్ హైస్కూల్ (Girls High School) ప్రాంగణానికి కొత్త శోభ సంతరించుకోనుంది. నూతన మెరుగులు అద్దేందుకు పెయింటింగ్(Painting)ను ఈరోజు ఘనంగా ప్రారంభించారు. విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి యునైటెడ్ వే(United Way), A&A కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్(A&A Construction and Developer), వెల్స్ ఫార్గో (wells fargo) ఎన్‌జీఓలు సహకారం అందించాయి.

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, హైదరాబాద్ బ్రాంచ్ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు(హెచ్.ఎం.) సుచిత్ర, ఎన్జీవో సభ్యులు మురళి కృష్ణ, యశ్వంత్, షేక్ అజార్ పాల్గొన్నారు. మామిడి భీమ్ రెడ్డి మాట్లాడుతూ.. “పాఠశాలలకు మౌలిక సదుపాయాలు కల్పించడం, విద్యార్థులకు మెరుగైన వాతావరణాన్ని అందించడం సమాజం(Society)లో ప్రతిఒక్కరి బాధ్యత. ఈ మంచి పనిలో భాగమైన ఎన్‌జీఓల (Ngo) సేవలు అభినందనీయం” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో M.B.కృష్ణ యాదవ్ టీజీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ కె.విద్యాసాగర్, హైదరాబాద్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అందె శ్రీధర్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ కన్స్యూమర్ కాన్‌సన్‌ట్రేషన్ ఆఫ్ ఇండియా రవికుమార్‌తోపాటు ఇతరులు, పాఠశాల సిబ్బంది, 60 మంది ఎన్‌జీఓల వాలంటీర్లు పాల్గొన్నారు. పెయింటింగ్ ద్వారా పాఠశాల భవనం ఆధునిక రూపాన్ని సంతరించుకొని బాలికలకు ఆదర్శవంతమైన, సురక్షితమైన విద్యా వాతావరణాన్ని అందిస్తుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు.
