కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత (Congress Party Senior Leader), మునుగోడు ఎమ్మెల్యే (Munugodu Mla) కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి.. రాజకీయాలు (Politics) వేరు, ప్రజాసేవ (Public Service) వేరు అని నిరూపించారు. ఓ పేద యువకుడికి కొత్త జీవితం ప్రసాదించారు. చిన్న కొండూరు గ్రామానికి చెందిన గణేష్‌కు సొంత డబ్బు రూ.12.5 లక్షలు ఖర్చు చేసి కామినేని ఆసుపత్రిలో కిడ్నీ మార్పిడి చికిత్స (Kidney Transplant Treatment) చేయించారు.

స్వయంగా హాస్పిటల్‌కి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి గణేష్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అతని కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రాజన్న తనకు ప్రాణదాతగా నిలిచారని బాధితుడు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఓవైపు మంత్రి పదవి (Minister Post) విషయంలో ఇటీవల బహిరంగ వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న మునుగోడు శాసన సభ్యులు రాజగోపాల్‌రెడ్డి.. మరోవైపు మానవత్వం (Humanity) ప్రదర్శించటంలో తనకుతానే సాటి అని చాటుకున్నారు.
