- ఆకాశ్ అంబానీ స్వయంగా ఫోన్ చేసి పిలిచారు..Rohit Sharma
- వెల్లడించిన స్టార్ బ్యాతారు రోహిత్ శర్మ..
ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పగ్గాలు మళ్లీ చేపట్టేందుకు తాను మొదట సిద్ధంగా లేనని, తీవ్ర సందిగ్ధంలో పడ్డానని రోహిత్ శర్మ వెల్లడించాడు. ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు రోహిత్ శర్మను తిరిగి సారథిగా నియమిస్తూ ఫ్రాంచైజీ అధికారికంగా నిర్ణయం తీసుకుంది. హార్దిక్ పాండ్య పంజాబ్ కింగ్స్‌కు బదిలీ కావడం, అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి రావడంతో 39 ఏళ్ల రోహిత్‌కు ముంబై యాజమాన్యం మళ్లీ బాధ్యతలు అప్పగించింది.Rohit Sharma
ఫ్రాంచైజీ యజమాని ఆకాశ్ అంబానీ స్వయంగా ఫోన్ చేసి కలిసినప్పుడు జరిగిన చర్చల వివరాలను రోహిత్ ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. జట్టును ముందుకు ఎలా తీసుకెళ్లాలనే విషయంపై ఇద్దరం చర్చించామని, ఆ సమయంలో మళ్లీ సారథ్యం చేపడతావా? అని ఆకాశ్ అడిగినప్పుడు తాను మొదట సంకోచించినట్లు తెలిపాడు.Rohit Sharma
ఇటీవలి సీజన్లలో జట్టులో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయని, మానసికంగా తాను ఆ బాధ్యతకు సిద్ధంగా ఉన్నానో లేదో తేల్చుకోలేక భార్యతోనూ మాట్లాడి కాస్త సమయం తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అయితే ముంబై జట్టుకు సరైన దిశానిర్దేశం అవసరమని గుర్తించి, దశాబ్ద కాలం పాటు తాను నిర్మించిన జట్టు కోసం ఈ సవాలును స్వీకరించాలని నిర్ణయించుకున్నట్లు రోహిత్ వివరించాడు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
