Homeరంగారెడ్డిDeeksha Divas Chevella | తెలంగాణ కోసం కేసీఆర్ పోరుబాట.. రేపు దీక్షా దివస్

Deeksha Divas Chevella | తెలంగాణ కోసం కేసీఆర్ పోరుబాట.. రేపు దీక్షా దివస్

  • ఉద్యమ జ్ఞాపకాలకు నివాళి.. చేవెళ్లలో బీఆర్ఎస్ దీక్షా దివస్Deeksha Divas Chevella
  • కేసీఆర్ నిరాహార దీక్షకు గుర్తుగా.. బీఆర్ఎస్ శ్రేణుల సమాయత్తం
  • అమరవీరుల త్యాగాలకు నివాళి.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో దీక్షా దివస్Deeksha Divas Chevella
  • కేసీఆర్ పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం
  • చేవెళ్లలో జరిగే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
  • కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి-బీఆర్ఎస్ శంకర్‌పల్లి మండల అధ్యక్షుడు గండిచెర్ల గోవర్ధన్ రెడ్డిDeeksha Divas Chevella

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, తెలంగాణ ఉద్యమానికి కీలక మలుపు తీసుకొచ్చిన బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ ఆదివారం దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమయ్యాయి.Deeksha Divas Chevella

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్ చేపట్టిన నిరాహార దీక్ష చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షను దేశవ్యాప్తంగా చర్చకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించిందని పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి ఆశయాల సాధనకు కృషి చేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. చేవెళ్లలోని అట్లాస్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం ఉదయం10:30 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ హోంమంత్రి,బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనాయకురాలు పి.సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.Deeksha Divas Chevella

- Advertisement -

ఈ కార్యక్రమానికి శంకర్‌పల్లి మండల, మున్సిపల్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, ప్రస్తుత, మాజీ సర్పంచులు, కౌన్సిలర్లు,మాజీ ఎంపీటీసీలు, పార్టీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ శంకర్‌పల్లి మండల అధ్యక్షుడు గండిచెర్ల గోవర్ధన్ రెడ్డి పిలుపునిచ్చారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News