Homeమేడ్చెల్‌Constitution Day | లోతుకుంటలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

Constitution Day | లోతుకుంటలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ మిషన్ కార్యనిర్వాహక కమిటీ ఆధ్వర్యంలో గురువారం అల్వాల్ లోతుకుంట ‘ఎక్స్’ రోడ్డులోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.(Constitution Day)
ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. 1949 నవంబర్ 26న మన రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నామని, అప్పటి నుండి ప్రతి ఏటా ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని గుర్తు చేశారు.

రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఛైర్మన్‌గా వ్యవహరించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భారత రాజ్యాంగ పితామహుడని కొనియాడారు. భారత రాజ్యాంగం దేశ పౌరులందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వంతో పాటు ప్రాథమిక హక్కులు, బాధ్యతలను అందించిందని పేర్కొన్నారు. అన్ని మతాలు, సంస్కృతులు, భాషలను గౌరవించాలని రాజ్యాంగం బోధిస్తుందని, మనమందరం రాజ్యాంగాన్ని రక్షించుకుంటూ, దాని ఆశయాలను అనుసరించాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

భీమ్ మిషన్ ఆఫ్ ఐడియాలజీ (BMI) సికింద్రాబాద్ కంటోన్మెంట్ కన్వీనర్ రమేష్ కమల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పి. అనంతరాజ్, కె.ఎ. లక్ష్మి, రమేష్ కమల, కె.ఎన్. సురేష్, సి. సురేష్, శివతో పాటు పెద్ద సంఖ్యలో అంబేద్కరిస్టులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. చివరగా “జై భీమ్ – జై సంవిధాన్” అంటూ నినాదాలు చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News