- కొత్త కోర్సులను ప్రవేశపెట్టనున్న ఐఐటిలు..IIT New Courses
- బీటెక్ నుంచి పీహెచ్ది వరకు అందుబాటులో కోర్సులు..
దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీల్లో ఇంజినీరింగ్ విద్యార్థులకు భారీ శుభవార్త అందనుంది. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా యువతను భవిష్యత్తు అవసరాలకు సిద్ధం చేసేందుకు కొత్త కోర్సులను ప్రవేశపెట్టాలని ఐఐటీలు నిర్ణయించాయి. ఇందులో భాగంగా రోబోటిక్స్, ఫిజికల్ ఏఐ, స్పేస్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ రంగాల్లో బీటెక్ నుంచి పీహెచ్డీ వరకు కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నారు. 2027-28 విద్యా సంవత్సరం నుంచి కొత్త కోర్సులను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి.IIT New Courses
అమెరికాకు చెందిన మెహతా ఫ్యామిలీ ఫౌండేషన్ ఇందుకు ఆర్థిక సహకారం అందించేందుకు ముందుకొచ్చింది. రానున్న ఎనిమిది నుంచి పదేళ్లలో ఈ మూడు రంగాల్లో కలిపి మొత్తం 6 వేల సీట్లను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. రోబోటిక్స్, ఫిజికల్ ఏఐ, స్పేస్ ఇంజినీరింగ్ రంగాల్లో నిపుణులకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ కోర్సులను రూపొందిస్తున్నారు. మొత్తం 6 వేల సీట్లలో బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ కోర్సులకు కేటాయింపులు చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
