- ట్రాఫిక్ రద్దీ తగ్గించాలంటే తప్పదు..Hyderabad IT Traffic
- సూచించిన డీజీపీ ఆనంద్, ఐపీఎస్..
హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో తీవ్ర ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఐటీ కంపెనీల పనివేళలు మార్చాల్సిన అవసరం ఉందని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ‘సైబరాబాద్ మూవ్స్ ఇన్ 2026’ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఐటీ కారిడార్ ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి పలు కీలక సూచనలు చేశారు.Hyderabad IT Traffic
అన్ని కంపెనీలకు ఒకే సమయంలో పనివేళలు ఉండటం వల్లే సైబరాబాద్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో ట్రాఫిక్ ఒత్తిడి తీవ్రంగా ఉంటోందని డీజీపీ తెలిపారు. సైబరాబాద్‌లో వీధుల అనుసంధానం సరిగ్గా లేదని, వర్షం పడితే వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లోనే చిక్కుకుపోతున్నారని ఆయన వివరించారు. ఇప్పటి నుంచే తగిన చర్యలు చేపట్టకపోతే హైదరాబాద్ కూడా బెంగళూరు తరహా ట్రాఫిక్ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉద్యోగులు సొంత వాహనాల కంటే ప్రజా రవాణాను ఎక్కువగా వినియోగించుకోవాలని కోరారు.
ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం జూబ్లీహిల్స్, కేబీఆర్ పార్క్ తరహాలో వన్-వే లూప్‌లు, ఫ్రీ లెఫ్ట్‌లు, యూ-టర్న్‌లు తీసుకురావాలని డీజీపీ ప్రతిపాదించారు. ఐటీ ఉద్యోగుల ప్రయాణాల కోసం ప్రత్యేక క్యారేజ్ వే, కౌంటర్-ఫ్లో బస్ లేన్లను పరిశీలించవచ్చని పేర్కొన్నారు. మియాపూర్ వంటి ప్రాంతాల్లో రోడ్ల విస్తరణ వేగవంతం చేయాలని, కంపెనీల భాగస్వామ్యంతో ఫ్లైఓవర్లు నిర్మించాలని సూచించారు. కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమలు చేసినప్పుడు తొలి 2-3 రోజులు ప్రజల నుంచి వచ్చే విమర్శలకు పోలీసులు భయపడకుండా, సమస్య పరిష్కారం కోసం ధైర్యంగా ముందుకు సాగాలని ఆయన స్పష్టం చేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
