- న్యాయవాది వినోద్ హిందుస్థానీ ఫిర్యాదుతో
- తెలంగాణ సీఎస్‌కు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు
- నాలుగు వారాల్లోగా ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్’ ఇవ్వాలని ఆదేశం
- ఆదిలాబాద్ రిమ్స్ అగ్నిప్రమాదం, వరంగల్ ఎంజీఎం ఘటనలపై ఆగ్రహం
తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్‌సీ) నెలకొన్న దుస్థితి, మౌలిక సదుపాయాల లేమిపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) తీవ్రంగా స్పందించింది.(Human Rights Violations) ఈ వ్యవహారంపై నాలుగు వారాల్లోగా సమగ్ర ‘యాక్షన్ టేకెన్ రిపోర్ట్’ (ఏటీఆర్) సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని గురువారం (నవంబరు 19) ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీవ్ర మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపిస్తూ నల్లగొండకు చెందిన హైకోర్టు న్యాయవాది వినోద్ హిందుస్థానీ ఎన్‌హెచ్‌ఆర్‌సీకి ఫిర్యాదు చేశారు (కేసు నం. 981/36/0/2026). ఆదిలాబాద్ రిమ్స్‌లోని స్పెషల్ న్యూబార్న్ కేర్ యూనిట్ (ఎస్‌ఎన్‌సీయూ)లో జరిగిన అగ్నిప్రమాదంలో ఇచ్చోడకు చెందిన సభా ఖాన్, ఇంద్రవెల్లికి చెందిన షేకు బాయి, ఉట్నూర్‌కు చెందిన సభా సమ్రీన్‌ల ముగ్గురు నవజాత శిశువులు మృతి చెందడాన్ని ఫిర్యాదులో ప్రధానంగా ప్రస్తావించారు.
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో పైకప్పులు కూలిపోవడం, రోగులపై ఎలుకలు, వీధి జంతువుల దాడులు, పడకలు, సిబ్బంది కొరతతో నేలపైనే చికిత్స అందించడం వంటి అంశాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (జీవించే హక్కు) ఉల్లంఘన, నేరపూరిత నిర్లక్ష్యం కిందకే వస్తాయని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై స్వతంత్ర భద్రతా ఆడిట్ నిర్వహించి, పారిశుద్ధ్యం, మౌలిక వసతులను మెరుగుపరచాలని, తగినంత సిబ్బందిని నియమించాలని, మరణించిన శిశువుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని కోరారు.
ఈ ఫిర్యాదును పరిశీలించిన కమిషన్, తగిన చర్యలు తీసుకుని ఆంగ్లంలో అనువదించిన నివేదికను హెచ్‌ఆర్‌సీనెట్ పోర్టల్ ద్వారా నాలుగు వారాల్లోగా అందజేయాలని సీఎస్‌కు నోటీసులు జారీ చేసింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
