Homeక్రైమ్ వార్తలుTerrorist Movements | జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద కదలికలు..

Terrorist Movements | జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాద కదలికలు..

  • ఒక్కరోజు ముందే రెక్కీ నిర్వహించిన ఉగ్రవాదులు.. Terrorist Movements
  • సీసీ టీవీ ఫుటేజీలో స్పష్టంగా వెల్లడి..

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదుల కదలికలకు (Terrorist Movements) సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నవంబర్ 11న సీఆర్పీఎఫ్ చెక్‌పోస్ట్‌పై దాడి జరగడానికి ఒక రోజు ముందే ఉగ్రవాదులు పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వెల్లడైంది. హతమైన ఉగ్రవాది ఉమర్ నిసార్ దార్, లష్కరే తోయిబా కమాండర్ లతీఫ్ భట్ కలిసి సంచరించిన దృశ్యాలు భద్రతా సంస్థలకు లభించాయి. ఈ పరిణామం భద్రతా వర్గాల్లో కలకలం రేపుతోంది. నవంబర్ 10న కుల్గాం జిల్లాలోని మీర్ బజార్, అఖ్రాన్, హబ్లిష్, కిలామ్ తదితర ప్రాంతాల్లో ఉమర్, లతీఫ్ భట్ సంచరించినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఆయా ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలించగా, ఇద్దరూ అనుమానాస్పదంగా తిరుగుతూ రెక్కీ నిర్వహించినట్లు వెల్లడైంది.

భద్రతా బలగాల కదలికలు, దాడులకు అనువైన ప్రాంతాలను పరిశీలించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దాడి అనంతరం వారి కదలికలు, పరారైన మార్గాలకు సంబంధించిన దృశ్యాలు కూడా కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. నవంబర్ 11న జరిగిన సీఆర్పీఎఫ్ చెక్‌పోస్ట్ దాడిలో ముగ్గురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. ఈ దాడి జరిగిన తర్వాత ఉమర్ నిసార్ దార్ ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)లో చేరినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. మరో కీలక విషయం ఏమిటంటే.. గత ఐదు నుంచి ఆరు నెలలుగా ఉమర్, లష్కరే తోయిబా కమాండర్ లతీఫ్ భట్‌కు ఆశ్రయం, ఇతర సహాయ సహకారాలు అందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఉమర్ అదృశ్యమైన తర్వాత అతని కుటుంబ సభ్యులు కుల్గాం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విచారణ ప్రారంభమైంది. ఆ తర్వాత అతని ఉగ్రవాద సంబంధాలు బయటపడ్డాయి.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News