- ఈ ఏడాది మేలో కెనడాలో తొలిసారి గుర్తింపు..PJ.2.1 COVID-19 variant
- కోవిడ్ కు కారణమయ్యే సార్లు – కొవ్ – 2 వైరస్ కు చెందిన ఒక ఉపకరం..PJ.2.1 COVID-19 variant
కరోనా వైరస్ మరో కొత్త రూపంలో ప్రపంచంలోని పలు దేశాల్లో వ్యాపిస్తోంది.(PJ.2.1 COVID-19 variant) పీజే.2.1గా పిలుస్తున్న ఈ కొత్త వేరియంట్‌ను ఈ ఏడాది మే నెలలో కెనడాలో తొలిసారిగా గుర్తించారు. ఆ తర్వాత అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తోపాటు ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లోనూ దీని ఉనికిని గుర్తించారు. ఈ వేరియంట్ వల్ల మరోసారి కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందా? ఇప్పటికే తీసుకున్న టీకాలు, శరీరంలోని రోగనిరోధక శక్తి దీనిపై ఎంతవరకు పనిచేస్తాయి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే ప్రస్తుత పరిశోధనల ప్రకారం ఈ వేరియంట్ గతంలో వ్యాప్తి చెందిన రకాల కంటే తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తుందని చెప్పడానికి తగిన ఆధారాలు లేవు.
దీని స్పైక్ ప్రొటీన్‌లో అనేక జన్యు మార్పులు ఉన్నప్పటికీ, టీకాల ద్వారా ఏర్పడిన రోగనిరోధక శక్తిని తప్పించుకునే సామర్థ్యం గణనీయంగా పెరిగినట్లు పరిశోధకులు గుర్తించలేదు. పీజే.2.1 అనేది కోవిడ్‌కు కారణమయ్యే సార్స్-కోవ్-2 వైరస్‌కు చెందిన ఒక ఉపరకం. సాధారణంగా వైరస్‌లో మార్పులు క్రమంగా చోటుచేసుకుంటాయి. కానీ ఈ వేరియంట్లో ఒకేసారి అనేక జన్యు మార్పులు కనిపించడంతో పరిశోధకులు దీన్ని ప్రత్యేక రకంగా పేర్కొంటున్నారు. ఈ వేరియంట్‌కు ప్రత్యేకమైన లక్షణాలను ఇప్పటివరకు గుర్తించలేదు. జ్వరం, చలి, దగ్గు, గొంతునొప్పి, ముక్కు కారడం లేదా మూసుకుపోవడం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట వంటి సాధారణ కోవిడ్ లక్షణాలే కనిపిస్తాయి. కొందరిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జీర్ణ సంబంధిత సమస్యలు, వాసన లేదా రుచి తెలుసుకునే సామర్థ్యంలో మార్పులు కూడా ఉంటాయి. ఈ లక్షణాలు సాధారణ జలుబు, కాలానుగుణంగా వచ్చే ఫ్లూ వ్యాధి లక్షణాలతో పోలి ఉంటాయి. అందువల్ల లక్షణాలను బట్టి మాత్రమే ఏ వ్యాధి సోకిందో నిర్ధారించడం సాధ్యం కాదు. అవసరమైనప్పుడు పరీక్షలు చేయించుకోవాలి. వైరస్ ఏ రకానికి చెందిందో తెలుసుకోవడానికి జన్యు క్రమ విశ్లేషణ చేస్తారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
