Homeనిజామాబాద్‌Tadwai Farmers | వడ్ల కొనుగోలులో కొర్రీలెందుకు..?

Tadwai Farmers | వడ్ల కొనుగోలులో కొర్రీలెందుకు..?

  • కల్లాల్లోనే ధాన్యం.. కొనుగోలు కేంద్రాల్లో జాప్యం..!
  • వడ్లు కొనరా..? రైతుల సహనానికి పరీక్ష పెడతారా..!
  • రైతుల పంటతో రాజకీయం చేయొద్దు.. వెంటనే వడ్లు కొనుగోలు చేయాలి…!
  • కల్లాల్లోనే 20 రోజులుగా ధాన్యం.. కొనుగోళ్లలో జాప్యంపై..
  • తాడ్వాయి సింగిల్ విండో మాజీ చైర్మన్ కపిల్ రెడ్డి ఆగ్రహం..!
  • లేకపోతే రైతులతో కలిసి నిజాంసాగర్ చౌరస్తాపై ధర్నా చేస్తాం …!

తాడ్వాయి: వడ్ల కొనుగోలులో కొత్త నిబంధనల పేరుతో రైతులను(Tadwai Farmers) ఇబ్బందులకు గురిచేయడం ఏమిటని తాడ్వాయి మాజీ సింగిల్ విండో చైర్మన్ కపిల్ రెడ్డి సొసైటీ అధికారులను నిలదీశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త షరతులు విధించడం సరికాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కల్లాల్లోకి ధాన్యం వచ్చి 20 రోజులు గడుస్తున్నా కొనుగోళ్లు ప్రారంభించకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. వడ్లను జల్లెడ పట్టిన తర్వాతే కొనుగోలు చేస్తామనే నిబంధనను ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. జల్లెడ పట్టేందుకు అవసరమైన యంత్రాలకు త్రీ ఫేజ్ విద్యుత్ ఎక్కడి నుంచి తీసుకురావాలని అధికారులను నిలదీశారు.

- Advertisement -

గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేశారని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కొనుగోలు పేరుతో” కొర్రీలు” పెడుతున్నారని విమర్శించారు. రైస్ మిల్లర్లు, సివిల్ సప్లై అధికారులు కుమ్మక్కై రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.

గతంలో కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వ్యాపారులు వచ్చి ధాన్యం కొనుగోలు చేసేవారని, ప్రస్తుతం వారిని రాకుండా కట్టడి చేయడంతో రైతులు పండించిన పంటకు డిమాండ్ తగ్గిపోయిందని అన్నారు. ప్రభుత్వం సూచించిన ఏడు రకాల సన్నధాన్యాలను రైతులు పండించినప్పటికీ, ప్రైవేట్ వ్యాపారులు తమకు నచ్చిన రకాలనే కొనుగోలు చేస్తున్నారని, మిగతా ధాన్యం పరిస్థితి ఏమిటని అధికారులను ప్రశ్నించారు.

తాను సింగిల్ విండో చైర్మన్‌గా ఉన్న సమయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాలకు పార్టీలకతీతంగా ప్రోటోకాల్ పాటించేవాడినని గుర్తుచేశారు. ప్రస్తుతం స్థానిక సర్పంచ్‌కు సైతం సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని అధికారులను ప్రశ్నించారు.

Paddy Procurement Delays in Tadwai2 1

కల్లాల్లో ధాన్యాన్ని రైతులు ఎన్నిరోజులు నిల్వ ఉంచుకోవాలని ప్రశ్నించిన కపిల్ రెడ్డి, ఎలాంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే రైతులతో కలిసి నిజాంసా చౌరస్తాను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ ముదం నర్సింలు, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ రాజిరెడ్డి, ఎండ్రియాల్ గ్రామ సర్పంచ్ నర్సింలు, ఉప సర్పంచ్ నర్సారెడ్డి, రైతులు జైపాల్ రెడ్డి, నవీన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, సిద్ధిరాంరెడ్డి, తాడ్వాయి సింగిల్ విండో సీఈఓ నర్సింలు తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News