దీపావళి పండుగ సందర్భంగా భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన అన్నాచెల్లెళ్ల అనుబంధాన్ని చాటిచెప్పే భగినీ హస్త భోజనం (యమ ద్వితీయ)(Bhagini Hastha Bhojanam) పర్వదినాన్ని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు.
ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ములకు నుదుటన తిలకం దిద్ది, హారతులు ఇచ్చి వారి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, దీర్ఘాయుష్షు కోసం ప్రార్థిస్తారు. అన్నదమ్ములు తమ అక్కాచెల్లెళ్లకు కానుకలు అందించి వారి పట్ల ప్రేమాభిమానాలను చాటుకుంటారు.
పురాణాల ప్రకారం యమధర్మరాజు తన సోదరి యమున ఇంటికి వెళ్లిన సందర్భంగా ఈ పర్వదినం ప్రారంభమైందని ప్రతీతి. ఈ పండుగ కుటుంబ బంధాలు, ప్రేమానురాగాలు, ఆత్మీయతలకు ప్రతీకగా నిలుస్తుందని సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత్ సమాజం జిల్లా సలహాదారు అన్మిశెట్టి జయప్రకాశ్ పేర్కొన్నారు.
మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందిస్తూ కుటుంబ విలువలను కాపాడుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు వెల్లివిరియాలని దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
