Homeరంగారెడ్డిMalkaram | మిషన్ భగీరథ పైపులైన్‌ పగులు.. వృథాగా పారుతున్న తాగునీరు

Malkaram | మిషన్ భగీరథ పైపులైన్‌ పగులు.. వృథాగా పారుతున్న తాగునీరు

జవహర్‌నగర్: జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మల్కారంలో(Malkaram) మిషన్ భగీరథ తాగునీటి పైపులైన్‌ పగిలిపోవడంతో విలువైన మంచి నీరు వృథాగా పారుతోంది. మూడు రోజుల క్రితం పైపులైన్‌ పగిలినప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు మరమ్మతు చర్యలు చేపట్టకపోవడంపై కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించాల్సిన పైపులైన్‌ నుంచి నీరు వృథాగా రోడ్డుపై పారుతుండటంతో నీటి వనరులు వృథా అవుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పైపులైన్‌ పగిలిన విషయాన్ని అధికారులు గుర్తించి వెంటనే మరమ్మతులు చేపట్టాల్సి ఉన్నప్పటికీ నిర్లక్ష్యం చేస్తున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.

- Advertisement -

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పగిలిన పైపులైన్‌కు తక్షణమే మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేస్తున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News