Homeసినిమా‘Salaar 2’ | సినిమా కోసం ప్రభాస్, ప్రశాంత్ నీల్ రీయూనియన్

‘Salaar 2’ | సినిమా కోసం ప్రభాస్, ప్రశాంత్ నీల్ రీయూనియన్

డైనోమైట్ ద్వయం.. వైలెంట్ మ్యాన్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిసి ‘సలార్: పార్ట్ 1 – సీజ్‌ఫైర్’తో ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లలో ఒకటిని అందించారు. ప్రముఖ హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు, బాబీ సింహా, శ్రీయా రెడ్డి కీలక పాత్రల్లో నటించారు.

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ ఫ్రాంచైజీపై అంచనాలను మరింత పెంచుతూ ‘సలార్ 2’(Salaar 2) సీక్వెల్‌ను ప్రకటించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘డ్రాగన్’ సినిమా పనులు పూర్తయిన తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ ‘సలార్ 2’ ప్రీ-ప్రొడక్షన్ పనులు(Salaar 2) ప్రారంభించనున్నారు. మరోవైపు ప్రభాస్ తన బిజీ షెడ్యూల్‌లో వరుసగా పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్నారు.

- Advertisement -

భారీ స్థాయి యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించడంలో, స్టార్ హీరోలను పవర్‌ఫుల్ మాస్ అవతార్ లో చూపించడంలో ప్రశాంత్ నీల్ తనదైన ప్రత్యేకస్టయిల్ ఏర్పరచుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ స్టయిల్ ఆయన సినిమాలకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. ‘సలార్: పార్ట్ 1 – సీజ్‌ఫైర్’ సాధించిన అద్భుతమైన విజయంతో పాటు ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌పై ఉన్న క్రేజ్.. సీక్వెల్ పై అంచనాలను మరింత పెంచాయి. ఈ ఇద్దరి కలయికలో మరోసారి పవర్‌ఫుల్ యాక్షన్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘సలార్ 2’కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేయనున్నారు మేకర్స్.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News