Homeసినిమా‘Fight Maha’ | చిత్రం అక్టోబర్ 22 నుండి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్

‘Fight Maha’ | చిత్రం అక్టోబర్ 22 నుండి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్

కలలు నిజమైతే.. అది ఎవరి నిజం? అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో తెరకెక్కిన సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘ఫైట్ మహా’.(Fight Maha) సునీల్, రాజు వెడ్స్ రామ్ భాయి ఫేం అఖిల్ ఉద్దేమారి హీరోలుగా నటించిన ఈ చిత్రంలో డాక్టర్ శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ నిర్మాణం లో సంచలనం సృష్టించిన ‘మర్డర్’ చిత్ర దర్శకుడు ఆనంద్ చంద్ర దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని న్యూ ఐ మూవీస్ ఎల్ఎల్‌పీ బ్యానర్‌పై ఏవీఎస్ రాజు, ఆర్. కుమార్ రాజు, ఆనంద్ చంద్ర నిర్మిస్తున్నారు.

నిర్మాత ఏవీఎస్ రాజు మాట్లాడుతూ..

- Advertisement -

“దర్శకుడు ఆనంద్ చంద్ర ఈ కథను మాకు వివరించినప్పుడు మేమంతా ఎంతో ఇష్టపడ్డాం. ఈ కథే సినిమాను నిర్మించాలనే స్ఫూర్తినిచ్చింది. దర్శకుడు కథను ఎంత అద్భుతంగా వివరించారో, అదే స్థాయిలో తెరపై కూడా ఆ కథను ఆవిష్కరించారు. విశాఖపట్నం, కేరళ, హైదరాబాద్ ప్రాంతాల్లో ఈ చిత్రాన్ని చిత్రీకరించాం.

సినిమా పోస్టర్‌లో సునీల్, అఖిల్ ఉద్దేమారి మాత్రమే కనిపిస్తున్నప్పటికీ, దాదాపు 40 మంది నటీనటులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.  ఇప్పుడు ‘ఫైట్ మహా’(Fight Maha) చిత్రం అక్టోబర్ 22 నుండి ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతుందని అయన తెలిపారు. “ఈటీవీ  విన్‌ ఓటిటి లో మా చిత్రం ప్రసారానికి సహకరించిన సి ఈ ఓ బాపినీడు చౌదరి గారికి, ఈటీవీ  విన్‌ సిబ్బందికి నా ధన్యవాదాలు” తెలిపారు.

దర్శకుడు ఆనంద్ చంద్ర మాట్లాడుతూ..

‘ఫైట్ మహా’(Fight Maha) చిత్రంలో మేము చూపించిన నిద్రలో నడిచే (స్లీప్‌వాకింగ్) అంశం చాలా ప్రత్యేకమైనది. గతంలో ఇలాంటి కథాంశాలతో కొన్ని సినిమాలు వచ్చినప్పటికీ, ఈ చిత్రంలో మేము ఆవిష్కరించిన విధానం తెలుగు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తుందని నమ్ముతున్నాం. కలలు, మానసిక అనారోగ్యం, విధి, అపరాధభావం, దాగి ఉన్న నిజాల చుట్టూ తిరిగే వినూత్నమైన సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. మా సినిమాలో ప్రధాన పాత్ర పేరు ‘మహా’. తన జీవితంలో ఎదురయ్యే సమస్యలు, సవాళ్లతో అతను నిరంతరం పోరాడుతుంటాడు. అందుకే ఈ చిత్రానికి ‘ఫైట్ మహా’ అనే టైటిల్‌ను పెట్టాం. జీవితంలో ఎన్ని నిరాశలు, అసంతృప్తులు ఎదురైనా దేనికీ వెనుకడుగు వేయకూడదనే సానుకూల సందేశాన్ని కూడా ఈ సినిమా అందిస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా పోరాడుతూ ముందుకు సాగాలి” అని దర్శకుడు వివరించారు.

నటీనటులు

సునీల్, అఖిల్ ఉద్దేమారి, డాక్టర్ శ్రీవాణి గోపిచంద్, వైష్ణవి, సిద్ధార్థ్, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, దీపక్ కేశవ్, కృష్ణరాజు (జోగి బ్రదర్స్), జబర్దస్త్ శాంతి కుమార్, ఆయేషా, హరీష్, పూర్ణ శ్రీ, మాస్టర్ రోహన్, మాస్టర్ జొన్న, హేమంత్ బాలాజీ, పద్మ వెంకట్, కందకట్ల, లక్ష్మి, సుమా రెడ్డి, నాగురిశ్లోకం, అభా భాయ్ జి. కల్యాణ్, మహేంద్రనాథ్, శ్రీ, పి. రామచంద్ర రాజు, ఏవీఎస్ రాజు, రోహిత్ కన్నా, మధు యాదవ్, దాసరి శ్రుతి, అర్జున్, ఎం. సీతారామ శాస్త్రి, భవానీ శంకర్, మంజుల రాథోడ్ తదితరులు నటించారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

సాంకేతిక బృందం

బ్యానర్: న్యూ ఐ మూవీస్ ఎల్ఎల్‌పీ
రచన, దర్శకత్వం: ఆనంద్ చంద్ర
నిర్మాతలు: ఏవీఎస్ రాజు, ఆర్. కుమార్ రాజు, ఆనంద్ చంద్ర
ఛాయాగ్రహణం: నాని అయ్యవెల్లి
ఎడిటర్: ఆనంద్ పవన్
ప్రొడక్షన్ డిజైనర్: దేవర మధుకర్
సంగీతం: వసంత్ ఇసైపెట్టై
సాహిత్యం: శ్రీరామ్ తపస్వి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: నరేంద్ర చారి
రోహిణి స్టూడియోస్ సీఈఓ: శ్రీనివాస్ నల్లగంట్ల
పీఆర్వో: రాంబాబు వర్మ

- Advertisement -
RELATED ARTICLES

Latest News