Homeనిజామాబాద్‌Panduga Sayanna | దోపిడీదారుల గుండెల్లో దడ పుట్టించిన ధీరుడు పండుగ సాయన్న..!

Panduga Sayanna | దోపిడీదారుల గుండెల్లో దడ పుట్టించిన ధీరుడు పండుగ సాయన్న..!

  • నిజాం నవాబుపై గర్జించిన ముదిరాజ్ పులిబిడ్డ ‘పండుగ సాయన్న:
  • ఎర్రపహాడ్‌లో ఘనంగా 174వ జయంతి వేడుకలు
  • ఘన నివాళులర్పించిన గ్రామ ముదిరాజ్ సంఘం.

తాడ్వాయి: నిజాం నిరంకుశ పాలనపై పిడికిలెత్తి, దొరలు, దేశ్‌ముఖ్‌ల దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన తెలంగాణ ముదిరాజ్ పులిబిడ్డ ‘పండుగ సాయన్న’(Panduga Sayanna) 174వ జయంతి వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. మండలంలోని ఎర్రపహాడ్ గ్రామంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. పండుగ సాయన్న తెలంగాణ విముక్తి పోరాటంలో మరువలేని యోధుడని కొనియాడారు. సంపన్నుల దోపిడీ సొమ్మును కొల్లగొట్టి నిరుపేదల ఆకలి తీర్చిన ‘తెలంగాణ రాబిన్‌హుడ్’ పండుగ సాయన్న అని, ఆయన ముదిరాజ్ జాతికి మాత్రమే కాక యావత్ తెలంగాణ సమాజానికే గర్వకారణమని గుర్తుచేశారు. నిజాం సైన్యాన్ని గడగడలాడించి, పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపిన ఆయన పోరాట పటిమ, త్యాగం నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం ప్రతినిధులు తిరుపతి, సాయిలు, భూపతి, నారాయణ, సదాశివుడు, మల్లయ్య, శంకర్, సతీష్‌లతో పాటు గ్రామ యువకులు, పెద్దలు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News