Homeహైదరాబాద్‌Sun City Durga Puja | ఘనంగా సన్‌సిటీ దుర్గా పూజ..

Sun City Durga Puja | ఘనంగా సన్‌సిటీ దుర్గా పూజ..

  • ముఖ్యఅతిధిగా హాజరైన ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్..
  • అందరికీ శుభాకాంక్షలు తెలిపిన సన్ సిటీ దుర్గా పూజా సమితి సభ్యులు..

భక్తి, సంప్రదాయం. సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలిచే దుర్గా పూజా వేడుకలను రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని బండ్లగూడ జాగీర్, సన్‌సిటీలో అత్యంత వైభవంగా నిర్వహించారు.. ‘సన్‌సిటీ దుర్గా పూజా సమితి'(Sun City Durga Puja) ఆధ్వర్యంలో ఈ వేడుకలు సగర్వంగా ప్రారంభం అయ్యాయి.. ఈ వేడుకల ప్రారంభోత్సవానికి రాజేంద్రనగర్ నియోజకవర్గం శాసనసభ్యులు టి. ప్రకాశ్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు..

సన్‌సిటీ దుర్గా పూజా సమితి తరఫున విచ్చేస్తున్న విశిష్ట అతిథులకు, నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు.. ఈ వేడుకలను విజయవంతం చేయడానికి కృషి చేస్తున్న సమితి ప్రధాన సభ్యులు సౌరవ్ బోస్, ప్రియాంక బోస్, దీప్ వర్మ, ప్రియాంక బెనర్జీ, సౌరభ్ రాయ్, నూపుర్ బెనర్జీ, సుభాషిష్, అభిషేక్, జయత్రి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

- Advertisement -

“మా విశిష్ట అతిథుల అమూల్యమైన రాకతో మా దుర్గా పూజా వేడుక మరింత ప్రత్యేకంగా, ఆనందంగా మారింది. భక్తి, సంప్రదాయాలు, ఐకమత్యానికి ప్రతీకగా నిలిచే ఈ వేడుకలో ప్రజలందరూ పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము” అని సమితి ప్రతినిధులు తెలిపారు. ఈ వేడుకల సందర్భంగా నగర ప్రజలందరికీ సన్‌సిటీ దుర్గా పూజా సమితి ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేశారు..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News