- తీవ్ర ఉద్రిక్తతలు..
- టౌన్ హాల్ భవనానికి నిప్పు..
ఫ్రాన్స్లో పెరుగుతున్న జీవన వ్యయానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు(Protest) హింసాత్మకంగా మారి తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ ఆందోళనల్లో భాగంగా 143 ఏళ్ల నాటి చారిత్రక లిమోజెస్ టౌన్ హాల్ భవనానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో భవనం చాలా వరకు ధ్వంసమైంది.
ఈ భవనానికి 1873లో నిర్మాణం ప్రారంభం కాగా, 1883లో అధికారికంగా ప్రారంభించడం జరిగింది. ఈ భవనం ఫ్రాన్స్లో చారిత్రక కట్టడంగా గుర్తింపు పొందింది. ముసుగులు ధరించిన కొందరు ఆందోళనకారులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. మంటల కారణంగా భవనం పైకప్పు పూర్తిగా కూలిపోయిందని, బయటి భాగంలో మూడింట రెండొంతులు నాశనమైందని వెల్లడించారు.
ఇది దేశ వారసత్వ సంపదకు జరిగిన ఘోర విపత్తు అని స్థానిక ప్రిఫెక్ట్ మారిస్ బరేట్ ఆవేదన వ్యక్తం చేశారు. దుండగులు ఉద్దేశపూర్వకంగానే ఈ దాడికి పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
