Homeఆదిలాబాద్VB-G RAM G Scheme | విబిజి రామ్ జీ పథకం ఎంతో ఉపయోగం..

VB-G RAM G Scheme | విబిజి రామ్ జీ పథకం ఎంతో ఉపయోగం..

  • అర్హులందరూ ఉపాధి పొందాలి : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా..
  • ప్రజల్ని అధికారులు ప్రోత్సహించాలి..
  • సూచించిన ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్..

విబిజి రామ్ జీ పథకం(VB-G RAM G Scheme) ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరూ ఉపాధి పొందాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పిలుపునిచ్చారు. శుక్రవారం భైంసా పట్టణంలోని సురలోక గార్డెన్స్ ఫంక్షన్ హాలులో, జోన్ 4, 5 లకు సంబంధించి విబిజి రామ్ జీ పథకం(VB-G RAM G Scheme) అమలుపై గ్రామీణ స్థాయి సూక్ష్మ ప్రణాళికపై కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ముధోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం ఎల్ నినో వల్ల వ్యవసాయం తీవ్ర ప్రభావానికి లోనైందని అన్నారు. పంటల దిగుబడి తగ్గిపోయిందని, వ్యవసాయ రంగంలో ఉపాధి అవకాశాలు కూడా తగ్గే అవకాశం ఉందని పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఆర్థిక ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు, నీటి సంరక్షణ పద్ధతులను బలోపేతం చేసేందుకు విబిజి రామ్ జీ పథకం ఒక చక్కని అవకాశం అని వివరించారు. జాబ్ కార్డు కలిగిఉన్న ప్రతి ఒక్కరు 125 రోజుల పని దినాలు పొందాలని సూచించారు. దీని ద్వారా పేదలకు ఆర్థిక స్వాంతన చేకూరుతుందని చెప్పారు. విబిజి రామ్ జీ కార్యక్రమం కింద పెద్ద ఎత్తున నీటి సంరక్షణ పనులను చేపట్టాలని సూచించారు. ప్రస్తుతం అధిక ఉష్ణోగ్రతలు, లోటు వర్షపాతం కారణంగా భూగర్భ జలాలు తగ్గిపోయాయని, జలాశయాల్లో కూడా నీటి లభ్యత తక్కువగా ఉందని, నీటి సంరక్షణ చర్యలు పాటించడం ద్వారా భూగర్భ జలాల సంరక్షణకు తోడ్పడడం తోపాటు భవిష్యత్తు అవసరాలకు నీటి వనరులను కాపాడినట్లవుతుందని తెలిపారు.

- Advertisement -

విబిజి రామ్ జీ పథకం ద్వారా అర్హులైన ప్రజలందరూ ఉపాధి పొందేలా ప్రజలను అధికారులు ప్రోత్సహించాలని ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ఎల్ నినో ప్రభావం చేత ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని, విబిజి రామ్ జీ పథకం ద్వారా ప్రజలకు ఉపాధి కల్పిస్తే వారికి ఊరట లభిస్తుందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్ లు, పంచాయతీ కార్యదర్శులు విబిజి రామ్ జీ పథకం గురించి విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఈ పథకం ద్వారా రైతులు తమ వ్యవసాయానికి సంబంధించి పనులను కూడా చేసుకునేందుకు వీలు ఉంటుందని వివరించారు. నీటి సంరక్షణ పనులను చేపట్టేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.

ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ సుధాకర్, డిఆర్డిఓ విజయలక్ష్మి డిపిఓ శ్రీనివాస్, జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీర్ తుకారాం, తహసిల్దార్ శశిభూషణ్, ఎంపిడివో పుష్పలత, ఇతర అధికారులు, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు, విబిజి రామ్ జీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News