- మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ చేయూత
జవహర్నగర్: జవహర్నగర్ పరిధిలోని చంద్రపురి కాలనీకి చెందిన డయాలసిస్ బాధితుడు సండం సాయికుమార్కు మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా రూ.10 వేల ఆర్థిక సాయం(Financial Support) అందజేశారు.
అనారోగ్యంతో బాధపడుతూ వైద్య ఖర్చులకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సాయికుమార్ పరిస్థితిని తెలుసుకున్న శ్రీనివాస్ గుప్తా వెంటనే స్పందించారు. బాధితుడి ఇంటికి వెళ్లి ఆర్థిక సాయం(Financial Support) అందించడంతో పాటు ఆయనకు ధైర్యం చెప్పారు. వైద్య చికిత్సకు మరింత సహాయం అవసరమైనా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. సాయికుమార్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కృష్ణ బాబా, శ్రీమన్నారాయణ, మాధవ్, శ్రీనివాస్ గౌడ్, సవిత, మాధవి తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
