Homeమహబూబ్‌నగర్‌BRS Leaders | రైతుల కన్నీళ్లు తుడవండి.. రాజకీయాలు ఆపండి!

BRS Leaders | రైతుల కన్నీళ్లు తుడవండి.. రాజకీయాలు ఆపండి!

  • ఎల్‌నినోను సాకుగా చూపి రైతుల సమస్యల నుంచి తప్పించుకోలేరు!
  • కరెంటు కోతలు ముమ్మాటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యమే
  • రైతులకు ఇచ్చిన హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి
  • బీఆర్‌ఎస్‌ రాష్ట్ర మీడియా ప్యానలిస్టు లక్ష్మీనరసింహారెడ్డి డిమాండ్‌

ఆమనగల్‌: ఎల్‌నినోను సాకుగా చూపి రైతుల సమస్యల నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వం తప్పించుకోలేదని,పంటలు చేతికొచ్చే సమయంలో విద్యుత్‌ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే బాధ్యత నుంచి తప్పించుకోవడం సరికాదని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర మీడియా ప్యానలిస్టు లక్ష్మీ నరసింహా రెడ్డి అన్నారు.ఎల్‌నినో సహజ వాతావరణ పరిణామమే అయినప్పటికీ,దాని ప్రభావంతో రైతులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.సోమవారం ఆమనగల్‌ మండల కేంద్రంలో స్థానిక బీఆర్‌ఎస్‌ నాయకులతో(BRS Leaders) కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కాంగ్రెస్‌ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.

రైతుల సమస్యలపై సమాధానం చెప్పాలి

- Advertisement -

ఎల్‌నినో అంశాన్ని రాజకీయ విమర్శలకు ఉపయోగించుకోవడం మానుకుని,రైతుల సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కాంగ్రెస్‌ నాయకులు సమాధానం చెప్పాలని లక్ష్మీ నరసింహా రెడ్డి డిమాండ్‌ చేశారు.వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు రైతులను అప్రమత్తం చేయడంతోపాటు,పంటలను కాపాడేందుకు అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.జలాశయాల్లో నీటి నిర్వహణ,సాగునీటి సరఫరా,వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ అందించడం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించడం వంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు.

హామీల అమలుపై శ్వేతపత్రం విడుదల చేయాలి

రైతుభరోసా,పంట రుణమాఫీ,సన్నవడ్ల బోనస్‌ వంటి పథకాల గురించి గొప్పలు చెప్పుకోవడం కాకుండా,అర్హులైన రైతులందరికీ వాటి ప్రయోజనాలు అందాయా లేదా అన్నది ప్రభుత్వం వెల్లడించాలని ఆయన డిమాండ్‌ చేశారు.రైతులకు ఇచ్చిన హామీల అమలు,పంట నష్టపోయిన రైతులకు పరిహారం,సాగునీరు అందక ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలపై సమగ్ర వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.రైతులకు ఇచ్చిన హామీల అమలులో ఉన్న వాస్తవ పరిస్థితిని ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు.

గత ప్రభుత్వంపై విమర్శలతో బాధ్యత తీరదు

బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలన గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్‌ నాయకులు,తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఇచ్చిన హామీల అమలు పరిస్థితిని వివరించాలని లక్ష్మీ నరసింహా రెడ్డి అన్నారు.గత ప్రభుత్వంపై విమర్శలు చేయడం ద్వారా ప్రస్తుత ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకోలేదని పేర్కొన్నారు.రైతుబంధు,రైతుబీమా,వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌,సాగునీటి ప్రాజెక్టుల ద్వారా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం(BRS Leaders) రైతులకు ప్రయోజనాలు అందించిందని ఆయన పేర్కొన్నారు.

పంటలు ఎండిపోతుంటే రాజకీయ విమర్శలా?

పంటలు చేతికొచ్చే సమయంలో విద్యుత్‌ కోతల కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని,సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితులు ఏర్పడితే వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని లక్ష్మీ నరసింహా రెడ్డి అన్నారు.రైతుల సమస్యలకు పరిష్కారాలు చూపకుండా ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.ప్రకృతి పరిణామాలను నియంత్రించడం సాధ్యం కాకపోయినా,వాటి ప్రభావాన్ని తగ్గించేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించడం,రైతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం ప్రభుత్వ బాధ్యతని స్పష్టం చేశారు.

“ఎల్‌నినోను బీఆర్‌ఎస్‌ సృష్టించలేదు.. కానీ ఎల్‌నినో ప్రభావంతో రైతులు ఎదుర్కొనే కష్టాలను తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.గత ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకుని, రైతులకు ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్‌ నాయకులు సమాధానం చెప్పాలి” అని ఆయన డిమాండ్‌ చేశారు.ఈ సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులు సయ్యద్‌ ఖలీల్‌, చుక్కా నిరంజన్‌ గౌడ్‌,అనూషా శ్రీశైలం, అనంతుల సైదులు గౌడ్‌,మాజీ మార్కెట్‌ డైరెక్టర్‌ రమేష్‌ నాయక్‌,మాజీ వార్డు సభ్యులు కోట శ్రీనివాస్‌, వస్పుల సాయిలు,మీసాల వర్షిత్‌ తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News