- సినీనటులు హైపర్ ఆది, ఇరుముడి ఫేమ్ మణెమ్మ, గాయత్రి మరియు జబర్దస్త్ టీమ్ సందడి చేశారు
నిర్మల్ సీబీఎస్ (చందన బ్రదర్స్ షాపింగ్ మాల్) నూతన షోరూం బోయివాడ, భారతి పెట్రోలియం పక్కన, నటరాజ్‌నగర్‌లో సినీనటులు మణెమ్మ, గాయత్రి చేతుల మీదుగా ఘనంగా దసరా ధమాకా (Dasara Dhamaka Sale) సేల్ ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మణెమ్మ, గాయత్రి మాట్లాడుతూ.. నిర్మల్ కి రావడం చాలా సంతోషంగా ఉంది సీబీఎస్ ప్రారంభోత్సవంలో భాగం కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కుటుంబ వేడుకలు, ప్రత్యేక కార్యక్రమాలు, షూటింగ్ కాస్ట్యూమ్స్ కోసం తాను సీబీఎస్‌లోనే షాపింగ్ చేస్తానని తెలిపారు. ఇక్కడ లభించే డిజైన్లు, వెరైటీలు ప్రత్యేకంగా ఉంటాయని, అందుకే సీబీఎస్ తనకు ఎంతో ఇష్టమైన షాపింగ్ డెస్టినేషన్‌గా మారిందన్నారు.


సీబీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ జానా సురేష్ మాట్లాడుతూ.. 40 ఏళ్ల అనుబంధంతో తమ సంస్థ తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తోందన్నారు. తాము ప్రారంభించిన ప్రతి షోరూంకు స్థానిక ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని చెప్పారు. నిర్మల్ ప్రజల అభిరుచులకు అనుగుణంగా వస్త్రాలను ప్రత్యేకంగా ఎంపిక చేసి షోరూంను తీర్చిదిద్దినట్లు ఇప్పుడు నిర్మల్ ప్రజల కోసం దసరా ధమాకా (Dasara Dhamaka Sale) సేల్ తీసుకొచ్చాము అని తెలిపారు. అన్ని ఆదాయ వర్గాల ప్రజలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన సంప్రదాయ వస్త్రాలతో పాటు ఆధునిక ఫ్యాషన్ దుస్తులను అందించడమే తమ లక్ష్యమన్నారు.

అదే తమ విజయ రహస్యమని తెలిపారు. దసరా, దీపావళి పండుగలతో పాటు షోరూం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక తగ్గింపులు, ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తున్నట్లు వెల్లడించారు. ప్రారంభోత్సవం సందర్భంగా షోరూంలో భారీగా కస్టమర్లు సందడి చేశారు. ముఖ్యంగా మహిళలు ప్రత్యేక ఆఫర్లను సద్వినియోగం చేసుకుంటూ చీరలు, ఇతర వస్త్రాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. దీంతో షోరూం అంతా పండుగ వాతావరణాన్ని తలపించింది. సీబీఎస్ చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “దసరా ధమాకా సేల్” (CBS Dasara Dhamaka) లో భాగంగా కస్టమర్లకు ఆకర్షణీయమైన ధరల్లో ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు. (https://epaper.aadabhyderabad.in/)(Youtube)
