- మున్సిపల్ రెగ్యులర్ శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టుపై సీడీఎంఏకు సమాచారం లేదా?
- విస్తరించిన పట్టణం.. పెరిగిన పారిశుధ్య బాధ్యతలు.. అయినా కీలక పోస్టు ఖాళీగానే!
వనపర్తి మున్సిపాలిటీలో కీలకమైన రెగ్యులర్ శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టు ఎన్నో ఏళ్లుగా ఖాళీగా(Vacancy) ఉండటం చర్చనీయాంశంగా మారింది. పట్టణ పారిశుధ్య నిర్వహణ, పారిశుధ్య కార్మికుల పర్యవేక్షణ, చెత్త సేకరణ – తరలింపు, డ్రైనేజీల శుభ్రత తదితర అంశాలపై పర్యవేక్షణలో శానిటరీ ఇన్స్పెక్టర్ కీలక బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉంటుంది. అయితే ఇంతకాలంగా పోస్టు ఖాళీగా ఉన్నప్పటికీ భర్తీపై స్పష్టత లేకపోవడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఖాళీ పోస్టు భర్తీకి మున్సిపల్ అధికారులు ప్రతిపాదనలు పంపారా? పోస్టు మంజూరు లేదా నియామకానికి ఏమైనా పరిపాలనా సమస్యలు ఉన్నాయా? నియామక ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
సీడీఎంఏ నిర్ణయం ఏమిటి?..
మున్సిపల్ పరిపాలనలో కీలకమైన సీడీఎంఏ పరిధిలో పోస్టుల భర్తీకి సంబంధించిన అంశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో వనపర్తి మున్సిపాలిటీలో(Wanaparthy Municipality ఎన్నో ఏళ్లుగా ఖాళీగా(Vacancy) ఉన్న రెగ్యులర్ శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టుపై సీడీఎంఏ స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంది. పోస్టు భర్తీకి ప్రతిపాదనలు అందాయా? అందితే వాటి ప్రస్తుత పరిస్థితి ఏమిటన్నది వెల్లడించాల్సి ఉంది.
విస్తరించిన పట్టణం.. పెరిగిన బాధ్యతలు..
వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో 33 వార్డులు ఉన్నాయి. పట్టణ విస్తీర్ణం, జనాభా, పారిశుధ్య అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో శానిటేషన్ విభాగంపై బాధ్యతలు కూడా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో రెగ్యులర్ శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టు ఖాళీగా ఉండటంతో పారిశుధ్య వ్యవస్థ పర్యవేక్షణపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఇకనైనా భర్తీ చేస్తారా?..
ప్రజారోగ్యంతో నేరుగా ముడిపడి ఉన్న పారిశుధ్య విభాగంలో కీలకమైన పోస్టును మరింత కాలం ఖాళీగా ఉంచకుండా రెగ్యులర్ శానిటరీ ఇన్స్పెక్టర్ను ఎప్పుడు నియమిస్తారో సీడీఎంఏ, మున్సిపల్ అధికారులు స్పష్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఖాళీగా ఉన్న పోస్టు.. ఇంకెన్నాళ్లు ఖాళీగానే? భర్తీకి ఎప్పుడు గ్రీన్ సిగ్నల్? అన్న ప్రశ్నలకు సంబంధిత అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
