- సామాజిక బాధ్యత చాటుకున్న మై హోమ్ సిమెంట్స్ యాజమాన్యం…
మెళ్ళచెరువు: మేళ్లచెరువు మండల కేంద్రంలో ఉన్న మై హోమ్ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యం సామాజిక బాధ్యతలో భాగంగా మఠంపల్లి మండలంలోని గుండ్లపల్లి గ్రామ పంచాయతీకి వాటర్ ట్యాంకర్ను(Water Tanker Donation) బహూకరించింది. మై హోమ్ సిమెంట్ పరిశ్రమ తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధుల ద్వారా రూ.2.35 లక్షల విలువ గల ట్యాంకర్ను సమకూర్చింది.
ఫ్యాక్టరీ ఆవరణలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పరిశ్రమ హెడ్ యన్.శ్రీనివాస్ రావు మరియు కంపెనీ ప్రతినిధులు వాటర్ ట్యాంకర్ను గుండ్లపల్లి సర్పంచ్ గుండా వెంకట రమణ బ్రహ్మారెడ్డికి అధికారికంగా అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ ప్రజల అవసరాలను గుర్తించి మై హోమ్ యాజమాన్యం వాటర్ ట్యాంకర్ను అందించడం అభినందనీయమన్నారు.
తాగునీటి సరఫరాతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాలు,వేసవిలో నీటి ఎద్దడి నివారణకు ఈ ట్యాంకర్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. గ్రామపంచాయతీ అవసరాలను పరిగణనలోకి తీసుకుని సహకారం అందించిన మై హోమ్ యాజమాన్యానికి గ్రామ పంచాయతీ తరఫున వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మై హోమ్ ఫ్యాక్టరీ హెడ్ శ్రీనివాస రావు,పి&ఎ జనరల్ మేనేజర్ డి. శ్రీరామ్, సీనియర్ డిజియం (మైన్స్) అప్పల రాజు, ఎజియం విఎస్ సుబ్రహ్మణ్యం,సిద్ధం వెంకట రత్నం,గ్రామ ఉప సర్పంచ్ కె.కొండలు,పంచాయతీ వార్డు సభ్యులు,గ్రామస్తులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
