- వెటర్నరీ డాక్టర్ పర్వీన్ ఫాతిమా నిర్వాకం…
- అటెండర్‌తో సొంత కారును శుభ్రం చేయించడం పై ఆగ్రహం!
- మీడియా ప్రశ్నిస్తే.. ‘మీకు మా డిపార్ట్మెంట్తో సంబంధం లేదు’ అంటూ సమాధానం!
కౌడిపల్లి: ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిని ప్రజా సేవలకు వినియోగించాల్సిందిపోయి.. వ్యక్తిగత పనులకు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలు కౌడిపల్లి మండల(Kowdipally Mandal) కేంద్రంలోని వెటర్నరీ ఆసుపత్రిలో వెలుగుచూశాయి. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న పర్వీన్ ఫాతిమా తన వ్యక్తిగత కారును ఆసుపత్రి అటెండర్‌తో నీటితో శుభ్రం చేయడం విమర్శలకు దారితీసింది.

ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలోనే వ్యక్తిగత కారును సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నారన్న అంశంపై రిపోర్టర్లు ప్రశ్నించగా.. “మీకు మా డిపార్ట్మెంట్తో ఎలాంటి సంబంధం లేదు.. అటెండర్‌గా తన సొంత పనులు చేయాల్సిందే” అంటూ సమాధానం ఇవ్వడం గమనార్హం. ప్రభుత్వ వేతనం తీసుకుంటూ విధులు నిర్వహించే సిబ్బందిని వ్యక్తిగత అవసరాలకు వినియోగించే అధికారం ఎవరికి ఉంది? అటెండర్ విధుల్లో భాగంగానే అధికారుల వ్యక్తిగత పనులు చేయాలా? లేక ప్రభుత్వ విధులకే పరిమితం కావాలా? అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.
ఈ వ్యవహారంపై సంబంధిత ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టి.. ఇంతకుముందు ఇలాంటి సందర్భాల్లో ఓ అధికారిని సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కూడా అవే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటారా? లేక ఈ వ్యవహారం ఇక్కడితోనే ముగుస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
