తెలంగాణ రాజకీయాల్లో ఆస్తుల రగడ తారాస్థాయికి చేరింది.. సీఎం రేవంత్రెడ్డి విసిరిన విమర్శలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో స్పందిస్తూ విసిరిన బహిరంగ సవాల్ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది! ‘మా కుటుంబ ఆస్తులతో పాటు, రేవంత్రెడ్డి కుటుంబ ఆస్తులపై కూడా సుప్రీంకోర్టు లేదా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ జరిపించండి! ఈ విచారణలో మా తప్పు తేలితే ఎలాంటి శిక్షకైనా మేం సిద్ధం’ అంటూ ధైర్యంగా సవాల్ విసిరారు. ఈ సవాళ్లు ప్రతి సవాళ్ల వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు.. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ అని ప్రజలు గ్రహిస్తున్నారు.. తగిన సమయంలో తగిన విధంగా మీకు బుద్ధి చెబుతారు.. జాగ్రత్త.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
Aaj Ki Baath
- Advertisement -
