Homeఖమ్మంChalo Osmania | హలో మాదిగ విద్యార్థులారా అక్టోబర్ 6న చలో ఉస్మానియా

Chalo Osmania | హలో మాదిగ విద్యార్థులారా అక్టోబర్ 6న చలో ఉస్మానియా

  • వెంకటాపురం(నూగూరు)

6వ తేదీన చలో ఉస్మానియా (Chalo Osmania) కార్యక్రమాన్ని మాదిగ విద్యార్థులు విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు యాసం రమేష్ మాదిగ పిలుపునిచ్చారు. ఆయన అధ్యక్షతనల ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ ఆవరణలో బుధవారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… అక్టోబర్ 6 ఉస్మానియా లో జరిగే సభను విజయవంతం చేయాలన్నారు.

మండలంలోని మాదిగ విద్యార్థులు అత్యంత ఉత్సాహంతో పాల్గొని విజయవంతం చేయాలని, అలాగే మన కోసం బంగారు భవిష్యత్తు కొరకు బాట వేసిన మాదిగ జాతి జననేత మరో నవ అంబేద్కర్ పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ప్రతి అడుగును ఆయన మార్గంలో నడుద్దామన్నారు. కుల రహిత సమ సమాజం కోసం ప్రయాణం చేద్దామని పిలుపునిచ్చారు.

- Advertisement -

మాదిగ విద్యార్థులారా
మన కోసం….
మన భవిష్యత్తు కోసం,
మన జాతి అస్థిత్వం కోసం

మూడు దశాబ్దాలు అలుపెరగని పోరు సాగించి…రిజర్వేషన్ ఫలాలను నేడు నీ ముంగిట నిలిపి,మన బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన నేత, మహత్తర పోరాట యోధుడు మంద కృష్ణ మాదిగన్న పిలుపు అందుకొని జాతి విద్యార్థి ఉద్యమంలోకి ఉరకలెత్తే ఉత్సాహంతో కదలి రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు యాసం మహేష్ మాదిగ, కోగిల మల్లికార్జున్ మాదిగ, వేల్పుల మల్లేష్ మాదిగ, తోకల అంజి మాదిగ,కోగిల సృజన్ మాదిగ, గుద్దేటి నాగరాజు మాదిగ, కోగిల ఆనంద్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. (https://epaper.aadabhyderabad.in/) (Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News