- TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, మున్సిపల్ కమిషనర్‌లకు రజక సంఘం వినతిపత్రం అందజేత
- వెంటనే కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి స్థల పరిశీలనకు ఆదేశించిన జగ్గారెడ్డి
తెలంగాణ సాయుధ పోరాట వీరనారి, ధైర్యసాహసాలకు మరియు బహుజన ఆత్మగౌరవానికి ప్రతీక అయిన వీరనారి చాకలి ఐలమ్మ(Chakali Ailamma) విగ్రహాన్ని సదాశివపేట(Sadashivpet) పట్టణంలో ప్రతిష్ఠించేందుకు అనువైన స్థలాన్ని కేటాయించాలని సదాశివపేట రజక సంఘం ప్రతినిధులు కోరారు.
ఈ మేరకు టీపీసీసీ (TPCC) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి)Jagga Reddy మరియు సదాశివపేట మున్సిపల్ కమిషనర్ రజక సంఘం బృందం కలిసి వినతిపత్రం అందజేసింది.
ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ విముక్తి పోరాటంలో అలుపెరగని పోరాటం చేసి చరిత్ర సృష్టించిన చాకలి ఐలమ్మ విగ్రహాన్ని సదాశివపేట(Sadashivpet) పట్టణంలో ఘనంగా ప్రతిష్ఠించాలని సంఘం తరపున ఏకగ్రీవంగా తీర్మానించినట్లు తెలిపారు. మున్సిపాలిటీ నిబంధనల ప్రకారం పట్టణంలో అనువైన స్థలాన్ని పరిశీలించి త్వరితగతిన కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
విగ్రహ ప్రతిష్ఠాపనకు ప్రతిపాదించిన స్థలాలు:
సదాశివపేట బస్టాండ్ పరిసర ప్రాంతం
మేస్త్రి మల్లయ్య బిల్డింగ్ పక్కన (బైపాస్ రోడ్డు)
సదాశివపేట బైపాస్ ఎంట్రీ రోడ్డు
వెంటనే స్పందించిన జగ్గారెడ్డి:
రజక సంఘం విజ్ఞప్తిపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తక్షణమే స్పందించారు. అక్కడికక్కడే మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక అయిన వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు ప్రతిపాదిత ప్రాంతాలను పరిశీలించి, నిబంధనలకు అనుగుణంగా త్వరితగతిన స్థల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు:
ఈ కార్యక్రమంలో రజక సంఘం గౌరవ అధ్యక్షులు పట్నూరి గోవర్ధన్, అధ్యక్షులు పంచలింగాల హనుమాన్, ఉపాధ్యక్షులు గుర్పాడ అమర్‌నాథ్, గార్లపల్లి వినయ్ కుమార్, మద్దికుంట సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి మచ్చూరి తుకారం, కోశాధికారి గార్లపల్లి అనిల్ కుమార్, కార్యనిర్వాహకులు గార్లపల్లి శ్రీనివాస్, పట్నూరి రాజేష్, సలహాదారులు యు.ఎస్. మల్లేశం, పట్నూరి మల్లేశం, సభ్యులు పట్నూరి ప్రభు, గొల్లపల్లి రమేష్, గొల్లపల్లి కిరణ్, సి.హెచ్. దత్తు, మద్దికుంట రమేష్, పెద్దాపురం బాలకృష్ణ, తుంటి సంగమేశ్వర్, మీనపల్లి సాయికుమార్, మద్దికుంట యాదగిరి తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
