- వాలీబాల్, ఖోఖోలో ఎనిమిది ప్రథమ స్థానాలు..
- కబడ్డీలో పాపన్నపేట కు 3 స్థానాలు
- జిల్లా, రాష్ట్ర స్థాయిలే లక్ష్యం
పాపన్నపేట ఉన్నత పాఠశాల మైదానంలో మూడు రోజులుగా నిర్వహించిన ఎస్‌జీఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీల్లో కుర్తివాడ విద్యార్థులు(Kurthiwada Students) సత్తా చాటారు. వాలీబాల్, ఖోఖో విభాగాల్లో పాల్గొన్న అన్ని కేటగిరీల్లో ప్రథమ స్థానాలు సాధించి క్లీన్ స్వీప్ చేశారు. వాలీబాల్‌లో అండర్-17 బాలురు, బాలికలు, అండర్-14 బాలురు, బాలికల జట్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. ఖోఖోలోనూ అండర్-17 బాలురు, బాలికలు, అండర్-14 బాలురు, బాలికల జట్లు విజేతలుగా నిలిచాయి. దీంతో రెండు విభాగాల్లో కలిపి కుర్తివాడ విద్యార్థులు ఎనిమిది ప్రథమ స్థానాలను కైవసం చేసుకున్నారు.
విద్యార్థులను జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలకు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రభాకర్ పట్టుదలతో శిక్షణ అందిస్తున్నారు. ఆయన కృషికి తోడు ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాసరావు, పాఠశాల సిబ్బంది అందిస్తున్న సహకారంతో విద్యార్థులు మండల స్థాయిలో అద్భుత ఫలితాలు సాధించారు. మండల స్థాయిలో విజయపరంపర కొనసాగించిన కుర్తివాడ విద్యార్థులు ఇదే స్ఫూర్తితో జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ ప్రతిభ చాటి పతకాలు సాధించాలని గ్రామస్థులు ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా కబడ్డీ విభాగంలో పాపన్నపేట ఉన్నత పాఠశాలకు మూడు స్థానాలు దక్కాయి. చికోడ్ లింగాయి పల్లి కి ఒక స్థానం దక్కింది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
