- పాల్గొన్న ప్రభుత్వ విప్ వేముల వీరేశం
కలెక్టరేట్ ప్రాంగణంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలను(Telangana Praja Palana Dinotsavam) గురువారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ వేముల వీరేశం, జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, ఎస్పీ జానకి షర్మిళ పాల్గొన్నారు.
ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన ప్రభుత్వ విప్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గేయం, జాతీయ గీతం, తెలంగాణ రాష్ట్ర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలను విప్ వివరించారు. Celebrations





ఉద్యానవన పంటల అభివృద్ధికి కృషి చేసిన మండల వ్యవసాయ అధికారులను అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
అనంతరం మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లబ్ధిదారు పుట్ట సుమన్‌కు మంజూరైన ఎలక్ట్రిక్ ట్రాలీ ఆటోను ప్రభుత్వ విప్ వేముల వీరేశం, కలెక్టర్ భవేశ్ మిశ్రా, అధికారులు కలిసి అందజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, డీఎఫ్ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే, డీఆర్వో రాథోడ్ రమేష్, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
