- ఉదయం 10 గంటలు దాటినా అందని వైనం
- మెనూకు మంగళం.. సిబ్బంది నిర్లక్ష్యం
- కొరవడిన అధికారుల పర్యవేక్షణ
- కౌడిపల్లి ఆశ్రమ పాఠశాలలో ఇదీ తీరు
కౌడిపల్లి మండల(Kowdipally Mandal) కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో(Tribal Ashram School,) విద్యార్థులకు కనీస సౌకర్యాలు, సమయపాలన కరువయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనల ప్రకారం ఉదయం 8 గంటలకే అందించాల్సిన అల్పాహారం(Breakfast Delay) 10 గంటలు దాటినా ఇవ్వకపోవడంతో విద్యార్థులు ఆకలితో ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది.అదేవిధంగా ప్రభుత్వం నిర్దేశించిన మెనూను సైతం సక్రమంగా అమలు చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆదివారం ఉదయం ఇడ్లీ ఇవ్వాల్సి ఉండగా పూరి ఇచ్చారు.
అది కూడా పది గంటలు దాటిన తర్వాతే. అల్పాహారం కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్న సమయంలో ‘ఆదాబ్ హైదరాబాద్’ ప్రతినిధి అక్కడికి వెళ్లి విద్యార్థులను పలకరించడంతో అల్పాహారం ఇంకా తినలేదని సమాధానం రావడంతో… సిబ్బందిని అడగగానే హడావుడిగా బ్రేక్‌ఫాస్ట్ అందించడం గమనార్హం. విద్యార్థుల భోజనం, మెనూ అమలు, సమయపాలనపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ కొరవడిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు తనిఖీలు చేసి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.కౌడిపల్లి(Kowdipally) గిరిజన ఆశ్రమ పాఠశాలలో జరుగుతున్న మరిన్ని పరిణామాలపై ఆదాబ్ హైదరాబాద్ మరిన్ని వరుస కథనాలతో మీ ముందుకు రానుంది.
వార్డెన్ వివరణ:
విద్యార్థులకు సమయానికి అల్పాహారం అందకపోవడం పట్ల ఆశ్రమ పాఠశాల వార్డెన్ జయరాజ్ ను వివరణ కోరగా… తాను అందుబాటులో లేనని సిబ్బంది పెట్టిస్తున్నారన్నారు. మెనూ విషయమై విద్యార్థుల కోరిక మేరకే ఇడ్లీ బదులుగా పూరి పెట్టామన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
