Homeనిజామాబాద్‌Tadwai Mandal | తాడ్వాయిలో అంబరాని అంటనున్న గణేశ్ సంబురాలు..

Tadwai Mandal | తాడ్వాయిలో అంబరాని అంటనున్న గణేశ్ సంబురాలు..

  • కన్నుల పండువగా నవరాత్రుల వేడుకలు !
  • ప్రతి ఏటా భారీ విగ్రహాలు.. వినూత్న శోభాయాత్రలు*
  • గణేశ్ ఉత్సవాల్లో ప్రతి యేటా ‘తాడ్వాయి’ రూటే సపరేట్..!
  • పల్లెల్లో గణేశ్ వైభవం.. తాడ్వాయి గల్లీల్లో యువత ప్రత్యేక సందడి !
  • పల్లెబాట పట్టిన యువత.. వరుస సెలవులతో గ్రామాల్లో పండుగ కళ ..

వినాయక చవితి(Vinayaka Chavithi) పండుగ ఆగమనంతో తాడ్వాయి మండలంలోని(Tadwai Mandal) పల్లెలన్నీ ఆధ్యాత్మిక శోభతో విలసిల్లుతున్నాయి. తెలుగు ప్రజలు జరుపుకునే పండుగల్లో వినాయక చవితికి ప్రత్యేక స్థానం ఉన్నప్పటికీ, తాడ్వాయి మండల(Tadwai Mandal) కేంద్రంతో పాటు, గ్రామాలలో జరిగే గణేశ్ నవరాత్రోత్సవాలకు ఉమ్మడి జిల్లాలోనే ఒక విశిష్ట గుర్తింపు ఉంది. ఇక్కడి గ్రామాలలో , గల్లీలలో యువత ఏమాత్రం వెనుకాడకుండా భారీ బడ్జెట్‌తో భారీ విగ్రహాలను ప్రతిష్ఠించి, అత్యంత వైభవంగా ఉత్సవాలు నిర్వహించడం తాడ్వాయి యువత ప్రత్యేకత.

తాడ్వాయి యువత జోరు ..
లక్షల్లో ఖర్చు, వినూత్న అలంకరణలు..!

మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల్లోని ‘గణేష్ యూత్’ సభ్యులు ఈ వేడుకలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. పోటీపడి మరీ భారీ కాయ గణపతులను కొలువుదీర్చి, లక్షల రూపాయల ఖర్చుతో నయనానందకరమైన సెట్టింగ్‌లు, రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో మండపాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. తొమ్మిది రోజుల పాటు విశేష పూజలు, అన్నదానాలతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడుతోంది.

- Advertisement -

కన్నుల పండువగా నిమజ్జన శోభాయాత్ర.. ప్రత్యేక ఆకర్షణగా కళారూపాలు

తాడ్వాయిలో(Tadwai) గణేశ్ నిమజ్జన ఘట్టం అత్యంత వైభవంగా సాగుతుంది. నిమజ్జన ఊరేగింపు కోసమే ప్రత్యేకంగా భారీ మొత్తంలో వెచ్చించి దూర ప్రాంతాల నుంచి ప్రసిద్ధి చెందిన డప్పు కళాకారులను, విభిన్న రీతుల సాంస్కృతిక నృత్య బృందాలను (తీన్‌మార్, ధోల్ తాషా, నాసిక్ డోలు, సాంప్రదాయ నృత్య కళాకారులను) రప్పిస్తారు. యువకుల నృత్యాలు, డప్పు చప్పుళ్ల హోరు, గులాల్ చల్లుతూ సాగే శోభాయాత్ర మండల ప్రజలకే కాక, చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సైతం కన్నుల పండువగా నిలుస్తుంది.

పల్లెబాట పట్టిన యువత ..
వరుస సెలవులతో పల్లెల్లో కళకళ

వినాయక చవితి(Vinayaka Chavithi) సందర్భంగా శని, ఆదివారాలు కలిసి వరుసగా సెలవులు రావడంతో పట్నాలలో ఉద్యోగాలు, ఉన్నత చదువులు అభ్యసిస్తున్న యువత, ఉద్యోగులు పెద్ద ఎత్తున సొంత ఊళ్లకు తరలివచ్చారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు ఊర్లోనే ఉంటూ బంధుమిత్రులతో కలిసి వేడుకల్లో పాల్గొంటున్నారు. కులమతాల భేదం లేకుండా అందరూ ఒక్కటై ఒకే కుటుంబంలా ఉత్సవాలు జరుపుకోవడం గ్రామీణ ఐక్యతను చాటుతోంది.

నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: తాడ్వాయి ఎస్సై నరేష్.

గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనం సందర్భంగా నిర్వాహకులు తగిన భద్రతా జాగ్రత్తలు పాటించాలని తాడ్వాయి ఎస్సై నరేష్ సూచించారు. విద్యుత్ తీగలు వేలాడే ప్రాంతాల్లో మండపాలు ఏర్పాటు చేయవద్దని, ప్రతి మండపానికి పోలీసు శాఖ ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఉత్సవాల్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం డీజేలకు అనుమతి లేదని, సంప్రదాయ డప్పు చప్పుళ్లు, పరిమిత సౌండ్ బాక్సులను మాత్రమే వినియోగించాలని స్పష్టం చేశారు. మద్యం సేవించి మండపాల వద్ద గానీ, ఊరేగింపుల్లో గానీ ఎవరూ పాల్గొనవద్దని హెచ్చరించారు. అందరూ సహకరించి శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో పండుగను విజయవంతం చేయాలని ఆయన కోరారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News