మండలంలోని శీలంపల్లి గ్రామంలో సెర్ప్ ఇందిరా మహిళా శక్తి విభాగం సీనియర్ మేనేజర్ భవాని శంకర్ గురువారం పర్యటించారు. గ్రామంలో ఇటీవల ఏర్పాటు చేసిన శరణ్య మునగ ఆకు ఉత్పత్తుల యూనిట్‌ను సందర్శించి(Inspection), నిర్వాహకురాలు మాసన్నగారి వనజను ఉత్పత్తుల తయారీ, ప్యాకేజింగ్,బ్రాండింగ్,మార్కెటింగ్ వివరాలు అడిగి తెలుసుకున్నారు.మునగ తోటల పెంపకంలో సేంద్రీయ పద్ధతులు,నాణ్యమైన ఉత్పత్తుల తయారీపై సూచనలు చేశారు.(https://epaper.aadabhyderabad.in/)
సోషల్ మీడియా,డిజిటల్ మార్కెటింగ్‌తో పాటు PMFME పథకం ద్వారా ఆర్థిక, సాంకేతిక సహకారం పొందే విధానాన్ని వివరించారు. అనంతరం చేయూత పెన్షన్ లబ్ధిదారు దూదేకుల బిస్మిల్లాను కలిసి పెన్షన్ ద్వారా అందుతున్న జీవనాధారాన్ని తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో డీపీఎం యాదయ్య, ఏపీఎం గౌరీశంకర్,పీడీ సీసీ శ్రీనివాస్,సీసీ పురుషోత్తం,సీఏ మాధవి, రాంరెడ్డి,వనజ,సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
