డిండి ప్రాజెక్టు పనులను తక్షణమే ఆపాలని, ఎర్రవెల్లి, అజిలాపూర్ గ్రామాలను ముంపు నుంచి కాపాడాలని ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగ జల సాధన సత్యాగ్రహ దీక్ష కన్వీనర్(Water Rights Protest), నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణ జేఏసీ చైర్మన్ ఆయిల్ సదానందం గౌడ్(Ailu Sadanandam Goud) డిమాండ్ చేశారు. ఈ నెల 12న శనివారం ఉదయం 11 గంటలకు నాగర్కర్నూలుపట్టణంలోని గాంధీపార్క్‌లో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే జల సాధన సత్యాగ్రహ దీక్షను విజయవంతం చేయాలనిపిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ జనసమితి అధినేత, ఎమ్మెల్సీ ప్రొ. కోదండరాం, రాఘవాచారిహాజరుకానున్నట్లు ఆయిల్ సదానందం గౌడ్ తెలిపారు. ఉమ్మడి పాలమూరు జిల్లా అధికార, ప్రతిపక్ష నేతలకు మన ప్రాజెక్టులపై సోయి లేదని, నల్లగొండ జల దోపిడి జరుగుతుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు. సీఎం సొంత జిల్లాలో డిండి ప్రాజెక్టు పేరుతో పాలమూరు రైతుల్ని ముంచడం న్యాయమేనా అని నిలదీశారు.(epaper.aadabhyderabad.in)
నల్లగొండ జిల్లా జలదోపిడినిఅరికట్టలేకపోతున్నారని, డిండి ప్రాజెక్టు పనులను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ఈ నెల 12న నాగర్‌కర్నూలు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ ఆధ్వర్యంలో 10 వేల మంది రైతులతో జల సాధన సత్యాగ్రహ దీక్ష విజయవంతం చేయాలని ఆయిల్ సదానందం గౌడ్ పిలుపునిచ్చారు.
