Homeమెదక్‌Chitkul Village | చిట్కుల్‌లో మేకలు, గొర్రెల సంత ప్రారంభం..

Chitkul Village | చిట్కుల్‌లో మేకలు, గొర్రెల సంత ప్రారంభం..

  • ప్రతి గురువారం నిర్వహణకు గ్రామపంచాయతీ నిర్ణయం

చిలిపిచేడ్ మండలం చిట్కుల్ గ్రామంలో(Chitkul Village) గురువారం మేకలు, గొర్రెల సంతను(Goat Sheep Market) గ్రామ సర్పంచ్ తుపాకీ రాములు, ఉపసర్పంచ్ అఖిల్ పాలకవర్గ సభ్యులు లాంఛనంగా ప్రారంభించారు.గ్రామంలో ప్రతి గురువారం వారపు సంత నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రాములు సభ్యులు మాట్లాడుతూ…

మేకలు,గొర్రెల పెంపకందారులు తమ పశువులను విక్రయించేందుకు,కొనుగోలుదారులు సులభంగా కొనుగోలు చేసేందుకు ఈ సంతను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. స్థానికంగా మార్కెట్‌ అందుబాటులోకి రావడంతో సమీప గ్రామాల ప్రజలకు కూడా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.మధ్యవర్తుల ప్రమేయం తగ్గి రైతులు,పశుపోషకులకు మెరుగైన ధర లభించే అవకాశం ఉంటుందని చెప్పారు.(epaper.aadabhyderabad.in)

- Advertisement -

అదేవిధంగా వినియోగదారులకు నాణ్యమైన మేకలు,గొర్రెలు అందుబాటు ధరల్లో లభించేలా మార్కెట్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు.ప్రతి గురువారం జరిగే ఈ సంతను పశుపోషకులు,వ్యాపారులు, కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలని గ్రామపంచాయతీ పాలకవర్గం కోరింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News