- ఎస్‌ఐ నర్సింలు
గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని చిలిపిచేడ్ ఎస్‌ఐ నర్సింలు సూచించారు. బుధవారం చిలిపిచేడ్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు(Safety Guidelines). మండపాల పూర్తి వివరాలను పోలీస్ శాఖ ఆన్‌లైన్ పోర్టల్‌లో ఉచితంగా నమోదు చేయాలని కోరారు.కంప్యూటర్ లేదా మొబైల్ ద్వారా http://policeportal.tspolice.gov.in/index.htm వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసి, దరఖాస్తును సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు అందించాలన్నారు.(epaper.aadabhyderabad.in)
ముందస్తుగా వివరాలు నమోదు చేయడం ద్వారా భద్రత,బందోబస్తు ఏర్పాట్లు సులభతరం అవుతాయని తెలిపారు.మండపాల వద్ద సీసీ కెమెరాలు,24 గంటలు వాలంటీర్లు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు.అగ్ని ప్రమాదాల నివారణకు ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు,నీటి డ్రమ్ములు,ఇసుక సిద్ధంగా ఉంచాలని సూచించారు.డీజేలు,టపాసులు వినియోగించరాదని,ఇతరుల మనోభావాలను దెబ్బతీసే నినాదాలు,ఫ్లెక్సీలు ఏర్పాటు చేయొద్దన్నారు.రాత్రి 10 గంటల వరకు మాత్రమే స్పీకర్లు వినియోగించాలని,అనుమానాస్పద వస్తువులు,వ్యక్తులు కనిపిస్తే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని కోరారు.
