Homeమెదక్‌Former Sarpanches | పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

Former Sarpanches | పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

  • మాజీ సర్పంచ్‌లను హౌస్‌ అరెస్ట్‌ చేసిన పోలీసులు

గ్రామ పంచాయతీల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన చిలిపిచేడ్‌ మండల(Chilipched Mandal) మాజీ సర్పంచ్‌లు(Former Sarpanches) గోపాల్‌రెడ్డి, బెస్త లక్ష్మణ్‌, అంకం యాదగిరి,స్వరూప విఠల్‌,రాకేష్‌లను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.గ్రామాల అభివృద్ధి, తాగునీరు, వీధి దీపాలు, పారిశుధ్యం, చెత్త సేకరణ,ట్రాక్టర్‌ డీజిల్‌ ఖర్చుల కోసం సొంత నిధులు వెచ్చించామని మాజీ సర్పంచ్‌లు తెలిపారు. పెండింగ్‌ బిల్లులు చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి, బిల్లుల చెల్లింపునకు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు.(epaper.aadabhyderabad.in)

- Advertisement -
RELATED ARTICLES

Latest News