Homeకరీంనగర్Farmers Protest | కరెంట్ కట్… రైతుల ఫైట్

Farmers Protest | కరెంట్ కట్… రైతుల ఫైట్

  • విద్యుత్ కోతలపై రోడ్డేక్కిన రైతులు

కోరుట్ల మున్సిపల్ పరిధిలోని ఎకిన్ పూర్ గ్రామంలో కరెంట్ కోతలను నిరసిస్తూ రైతులు ధర్నా, (Farmers Protest)రాస్తారోకో నిర్వహించారు. ఈసందర్బగా రైతులు పెద్ద ఎత్తున వచ్చి ప్రభుత్వం వ్యతిరేకంగా నినాదలు చేస్తూ 24 గంటల కరెంట్ ఇస్తున్నాం అని గొప్పలు చేప్పే రేవంత్ ప్రభుత్వం కనీసం 10 గంటలు కూడా ఇవ్వడం లేదని రైతులు మండిపడ్డారు.ఇప్పటికే వర్షాలు లేక కష్టాల్లో ఉన్న రైతులకు కరెంట్ లేకపోవడం వల్ల పంటలు ఎండిపోతున్నాయి యూరియా దొరకడం లేదు యాప్ కష్టాలు ఇలా చాలా రకాలతో రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు అని మండిపడ్డారు.

కనీసం 12 గంటలు అయినా త్రి పేస్ విద్యుత్ సరఫరా చేసి రైతులను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.(epaper.aadabhyderabad.in)ఈ కార్యక్రమం లో రైతు నాయకులు కాశిరెడ్డి మోహన్ రెడ్డి,పుట్టుకపు నర్సారెడ్డి, అరికంటి సాగర్ గంగారెడ్డి,సురేష్ రెడ్డి,జలంధర్ మల్లేషం, జగిలం లక్మినర్సయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News