Homeఅంతర్జాతీయంDental Treatment | అమెరికాలో దంత వైద్యం..

Dental Treatment | అమెరికాలో దంత వైద్యం..

  • పన్ను పీకించారా అంతే సంగతులు..
  • వైరల్ గా మారిన ఓ ఎన్నారై వీడియో..

అమెరికాలో దంత వైద్యం ఎంత ఖరీదుగా ఉంటుందో చెబుతూ ఓ ఎన్నారై చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక్క పన్ను తొలగించేందుకు తనకు సుమారు 2,500 డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.2.37 లక్షలు ఖర్చవుతుందని డెంటిస్ట్‌ చెప్పినట్లు నితిన్‌ మల్హోత్రా వెల్లడించారు. ఆరోగ్య బీమా ఉన్నప్పటికీ ఇంత పెద్ద మొత్తాన్ని కోట్‌ చేయడంతో తాను ఆశ్చర్యపోయినట్లు తెలిపారు. అమెరికాలో దాదాపు 15 ఏళ్లుగా నివసిస్తున్న మల్హోత్రా.. ఎన్నారై జీవితం గురించి తరచూ సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేస్తుంటారు.

తాజాగా ప్రాథమిక దంత చికిత్స కోసం డెంటిస్ట్‌ను సంప్రదించినప్పుడు ఎదురైన అనుభవాన్ని వీడియో ద్వారా పంచుకున్నారు. ఒక్క పన్ను తొలగించేందుకే 2,500 డాలర్ల బిల్లు రావడం తనను షాక్‌కు గురిచేసిందని చెప్పారు. అదే చికిత్సకు భారత్‌లో సాధారణంగా రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చవుతుందని పేర్కొన్నారు. అమెరికాలో ఎన్నారైగా జీవించడంలో ఇలాంటి ఖర్చులు కూడా ఒక భాగమేనని వ్యాఖ్యానించారు. తన వీడియోలో ఈ ఖర్చు సమంజసమేనా? లేక ఎక్కువగా వసూలు చేశారా? అంటూ మల్హోత్రా ప్రశ్నించారు. దీంతో సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ మొదలైంది.

- Advertisement -

ఒకరు అమెరికాలో మంచి డెంటల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవడం చాలా ముఖ్యమని, దంత చికిత్సకు భారత్‌ బెస్ట్‌ అని కామెంట్‌ చేశారు. మరో వ్యక్తి అమెరికాలో సంపాదనకు అవకాశాలు బాగున్నా.. వైద్య చికిత్సల విషయంలో భారత్‌ మెరుగ్గా ఉంటుందని అభిప్రాయపడ్డారు. మరో నెటిజన్‌ తన అనుభవాన్ని పంచుకుంటూ.. భారత్‌లో రూట్‌ కెనాల్‌ చికిత్సకు 100 డాలర్ల కంటే తక్కువే చెల్లించానని చెప్పారు. అదే చికిత్సకు అమెరికాలో 3,500 డాలర్ల బిల్లు ఇచ్చారని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News