- ప్రభుత్వం ఫోటోగ్రాఫర్ల సమస్యలను పరిష్కరించాలి.
- మండల అధ్యక్షుడు కృష్ణ చైతన్య గౌడ్..
తాడ్వాయి మండల కేంద్రంలో బుధవారం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని మండల ఫోటోగ్రాఫర్లు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఫొటోగ్రఫీ పితామహుడు “లూయిస్ డాగ్యురే “చిత్రపటానికి పూలమాలలు వేసి, ఫోటోగ్రఫీ జెండాను ఆవిష్కరించి ఫోటోగ్రఫీ వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఫోటోగ్రాఫర్లు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు కృష్ణ చైతన్య గౌడ్ మాట్లాడుతూ ఒక ఫోటో వెయ్యి పదాలను పలికిస్తుందని గడిచిపోయిన కాలాన్ని సజీవంగా ఉంచేది కేవలం ఫోటో మాత్రమేనని కాలం ముందుకు సాగిపోతుంది. కానీ ఆ కాలాన్ని శాశ్వతంగా ఆపి ఉంచే ఏకైక శక్తి ఫోటోగ్రఫీకి మాత్రమే ఉంది.ఫోటో మాట్లాడదు, కానీ చరిత్రను చెబుతుంది.
కంటితో చూసేది దృశ్యం కెమెరాతో బంధించేది అనుభూతి మనసుతో నిలిపేది జ్ఞాపకం. ఫోటోగ్రఫీ అంటే కేవలం కెమెరా క్లిక్ చేయడం కాదు; చూసే దృక్కోణం, అనుభవించే భావోద్వేగం. మనుషులు మారవచ్చు జ్ఞాపకాలు మసకబారవచ్చు. కానీ ఒక్క ఫోటో ఆ క్షణాన్ని ఎప్పటికీ సజీవంగా ఉంచుతుంది. ఫోటోగ్రాఫర్ ఐక్యత వర్ధిల్లాలి మీ సందర్భంగా నినాదాలు చేశారు.


ప్రభుత్వం ఫోటోగ్రాఫర్ల సమస్యను పరిష్కరించాలి.
రాష్ట్రవ్యాప్తంగా ఫోటోగ్రాఫర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అందమైన ఫోటోలు తీసే ఫోటోగ్రాఫర్ అతని జీవితంలో మాత్రం ఎంతో చీకటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాడని, ఫోటోగ్రాఫర్లకు సరి అయిన గుర్తింపు లేదని, ప్రోగ్రాంల కోసం ఎప్పుడు హడావుడిలో వెళ్లే ఫోటోగ్రాఫర్లు రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రమాదాలు కోల్పోతున్నారని, ఫోటోగ్రాఫర్లకు జీవిత బీమా, ఆరోగ్య భీమా, ప్రభుత్వం ఉచితంగా కల్పించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.
ఫోటోగ్రాఫర్లకు సమాజంలో సామాజిక భద్రత కరువైందని, ఫోటోగ్రాఫరర్స్ ని వృత్తి నైపుణ్యం కళాకారుడిగా గుర్తించి అతనికి గుర్తింపు కార్డులు మంజూరు చేయాలన్నారు. రాత్రిళ్ళు ప్రోగ్రాంలోకి వెళ్లి వచ్చేటప్పుడు పోలీసుల నుండి ఇబ్బందులు ఎదురకాకుండా గుర్తింపు కార్డులు పనిచేస్తాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సరియైన జీవనాధారం లేకుండా జీవించే ఫోటోగ్రాఫర్లకు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు, మంజూరు చేసి ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు, ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు సిద్ధిరాములు, మండల అధ్యక్షుడు కృష్ణ చైతన్య గౌడ్, కోశాధికారి ప్రభాకర్, సెక్రటరీ నితిన్, సీనియర్ ఫోటోగ్రాఫర్ సంజీవులు, ఫోటోగ్రాఫర్ సాయి,శ్రీకాంత్, నవీన్, విజయ్, తదితరులు పాల్గొన్నారు
