10వ తరగతి పరీక్ష ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ముగ్గురు పద్మశాలి విద్యార్థులకు అడ్డగుట్ట పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నగదు బహుమతి అందచేయడంతో పాటు దరకాస్తు చేసుకున్న విద్యార్థులందరికి పుస్తకాలు, జ్ఞాపికను అందచేసి సన్మానించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు పెండెం మనోహర్ మాట్లాడుతూ సంఘం ఏర్పడి 30ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతిభా వంతులైన తమ సామాజిక వర్గంలోని పిల్లలను ప్రోత్సహించడం కోసం బహుమతులు అందచేసి సన్మానించినట్లు తెలిపారు.


అందులో భాగంగా మొదటి బహుమతి కింద గిందం రాజు లావణ్య ల కూతురు అశ్వితకు 5వేలు, కట్కం వెంకటేష్ రజిత దంపతుల కూతురు తన్మయికి 3వేలు, వెల్ది రమేష్ అశ్వినిల కుమారుడు వరుణ్ కు 2వేల నగదు బహుమతి షీల్డ్ ప్రశంసా పత్రం అందచేసి సన్మానించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఆడెపు శ్రీరాములు, ఉపాధ్యక్షులు బొడ్డు సంతోష్, జాయింట్ సెక్రెటరీ సిల్వేరు రామకృష్ణ, కోశాధికారి కారంపొడి గణేష్, ఇప్పరపల్లి శ్రీనివాస్, హైదరాబాద్ జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి కల్లపల్లి రాజు, సికింద్రాబాద్ మంద జగన్ తో పాటు కుల సంఘం పెద్దలు పాల్గొన్నారు.
