Homeఖమ్మంRation Rice Smuggling | అక్రమ రేషన్ బియ్యం దందాకు చెక్…

Ration Rice Smuggling | అక్రమ రేషన్ బియ్యం దందాకు చెక్…

  • మిర్యాలగూడకు తరలుతున్న సుమారు310క్వింటాలు పట్టివేత
  • రూ.12లక్షల విలువ చేసే బియ్యం స్వాధీనం
  • ఆరుగురిపై కేసు నమోదు

పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లి సరిహద్దులు దాటుతున్న వ్యవహారంపై పాల్వంచ పట్టణ పోలీసులు కొరడా ఝుళిపించారు. పాల్వంచ నుంచి మిర్యాలగూడకు టిఎస్ 05యÖసి 1889 నెంబర్ గల లారీలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 310క్వింటాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన బియ్యం విలువ సుమారు రూ.12లక్షలు ఉంటుంది.సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం రాత్రి అప్రమత్తమై అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్న వాహనాలపై నిఘా పెట్టారు. అనుమానాస్పదంగా వెళ్తున్న ఓలారీన గుర్తించి తనిఖీచేయగా రేషన్‌బియ్యం బయటపడింది. దీంతో ఈ వాహనాన్ని అదుపులోకితీసుకోని పాల్వంచ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

పేదల బియ్యంపై అక్రమార్కుల కన్ను….

ప్రభుత్వం పేదలకు ఉచితంగా అందిస్తున్న రేషన్‌బియ్యాన్ని కొందరు అక్రమార్కులు దారి మళ్లించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ, పట్టణాల్లోలబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు బియ్యాన్ని సేకరించి పెద్దమొత్తంలో నిల్వచేసి ఇతర ప్రాంతాలకు తరలించే దందా కొనసాగిస్తున్నారు అక్రమార్కులు. పాల్వంచ నుంచి మిర్యాలగూడకు భారీగా బియ్యం తరలిస్తుండగా పట్టుబడ్డ అక్రమ రేషన్‌బియ్యం దందా బయటపడింది.సుమారు 310క్వింటాల రేషన్‌బియ్యం పట్టుబడటంతో దీని వెనుక ఉన్న సరఫరా దారులు, బియ్యం ఎక్కడి నుంచి సేకరించారు. ఎక్కడికి తరలిస్తున్నారు ఎవరికి చేరవేస్తున్నారో అనే అంశాలపై పోలీసులు దృష్టిసారించారు.

- Advertisement -

మిల్లు నుంచి తరలింపుపై ఆరా….

పాల్వంచలోని ఓరైస్ మిల్లు నుంచి ఈ బియ్యం తరలిస్తున్న వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. బియ్యం రవాణాకు సంబంధించిన పత్రాలు, వాహన వివరాలు, సరుకు యాజమాని తదితర అంశాలపై విచారణ కొనసాగుతుంది. పాల్వంచ సిఐ సతీష్ ఆదేశాల మేరకు టౌనఎసఐ నాగరాజు చర్యలు చేపట్టారు. పట్టుబడిన వ్యక్తులను విచారిస్తూ అక్రమ రేషన్ బియ్యం రవాణా చేస్తున్న వ్యక్తుల వివరాలను పోలీసులు సేకరించారు. పట్టుబడిన రేషన్‌బియ్యానికి సంబంధించి జిల్లా సివిల్ సప్లయ్ అధికారులకు ఎసఐ సమాచారం అందించారు.

అసలు సూత్రదారులు ఎవరు…?

310క్వింటాల రేషన్ బియ్యం పట్టుబడటంతో ఈ వ్యవహారంలో కేవలం డ్రైవర్, లారీయజమాని, బియ్యంసేకరణ దారులు, మిల్లర్లు, మధ్యవర్తులు, వ్యాపారస్తులు ఉన్నారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో ఇలాంటి అక్రమ రవాణాకు సంబంధించి ఎవరెవరి ప్రమేయం ఉందన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టే అవకాశం ఉంది. రేషన్‌బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఆరుగురుపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎసఐ నాగరాజు తెలిపారు. పేదల కోసం ప్రభుత్వం కేటాయించిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తూ కోట్లాదిరూపాయల దందాకు పాల్పడుతున్న ముఠాలపై నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News