ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ధైర్యం, స్థైర్యం, నిస్వార్థ సేవలోని స్ఫూర్తిని చాటిచెప్పేందుకు ఆగస్టు 14న ‘భారత్ భాగ్య విధాత’ ప్రత్యేక డిజిటల్ ప్రీమియర్‌తో హిందీ జీ 5 ప్రేక్షకులను ఆహ్వానిస్తోంది. భారతదేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు సాహసోపేతమైన, స్ఫూర్తిదాయకమైన, సాంస్కృతికంగా ప్రతిధ్వనించే కథలను అందించాలనే తన నిబద్ధతను కొనసాగిస్తూ ఈ స్వదేశీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ దేశాన్ని నిర్వచించే విలువలను ప్రతిబింబించే అసాధారణ ధైర్యసాహసాలు కలిగిన అజ్ఞాత వీరులను వెలుగులోకి తీసుకు వస్తుంది.
మనోజ్ తపడియా రచన, దర్శకత్వంలో పెన్ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్, పరమహంస్ క్రియేషన్స్, యూనోయా ఫిల్మ్స్ LLP, ఫ్లోటింగ్ రాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ భాగస్వామ్యంతో నిర్మించిన ‘భారత్ భాగ్య విధాత’ చిత్రంలో కంగనా రనౌత్‌తో పాటు గిరిజ ఓక్, స్మిత తాంబే తదితరులు నటించారు.
ముఖ్య వివరాలు:
టైటిల్ : భారత్ భాగ్య విద్ధాట
భాష: హిందీ
జానర్: థ్రిల్లర్ / డ్రామా
ప్రీమియర్: 14 ఆగస్టు 2026
రచయిత – దర్శకుడు: మనోజ్ తపడియా
నిర్మాతలు: PEN స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్, పరమహంస్ క్రియేషన్స్, యూనోయా ఫిల్మ్స్ LLP, ఫ్లోటింగ్ రాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్
తారాగణం: కంగనా రనౌత్, గిరిజ ఓక్, స్మిత తాంబే, ఇతరులు
స్ట్రీమింగ్: హిందీ జీ 5
‘భారత్ భాగ్య విధాత’ కథ ఏంటంటే?
26/11 ముంబై ఉగ్రవాద దాడుల నేపథ్యంలో, భారతదేశ చరిత్రలోని అత్యంత చీకటి అధ్యాయాలలో ఒకటైన ఆ కాలాన్ని ఈ చిత్రం తిరిగి గుర్తు చేస్తుంది. తమ ధైర్యసాహసాలు, నిస్వార్థతతో లెక్కలేనన్ని ప్రాణాలను కాపాడిన ఒక వీరుల బృందాన్ని ఈ చిత్రం వెలుగులోకి తీసుకుస్తుంది. ముంబైలోని కామా, అల్బ్లెస్ ఆసుపత్రి నేపథ్యంలో సాగే ఈ చిత్రం తమ సంరక్షణలో ఉన్న రోగులకు ప్రథమ రక్షణగా నిలిచిన నర్సులు, వార్డ్ బాయ్‌లు, క్లీనర్లు, భద్రతా సిబ్బంది, ఇతర ఆసుపత్రి సిబ్బంది అసాధారణమైన చర్యలను అనుసరిస్తుంది.
దాడి చేసినవారు ఆసుపత్రి ప్రాంగణంలోకి చొరబడినప్పుడు ఈ సాధారణ వ్యక్తులు అసాధారణ పరిస్థితులలో ముందుకు వచ్చారు. తమను తాము రక్షించుకోవడానికి పెద్దగా మార్గాలు లేకపోయినా తమ కర్తవ్య స్ఫూర్తితో వారు తమ ప్రాణాల కన్నా రోగుల ప్రాణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వారి అద్భుతమైన ధైర్యసాహసాలు, నిస్వార్థత ద్వారా, ఈ చిత్రం త్యాగం, కరుణ, దృఢ సంకల్పం వంటి ఇతివృత్తాలను అన్వేషిస్తుంది. ఊహించలేని ప్రతికూల పరిస్థితులలో మానవ స్ఫూర్తి బలాన్ని ఇది చాటిచెబుతుంది.
‘భారత్ భాగ్య విధాత’ ఎందుకు చూడాలంటే?
● నిజ సంఘటనల స్ఫూర్తి : అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించిన ఆరోగ్య కార్యకర్తల కళ్ళ ద్వారా, భారతదేశపు అత్యంత కీలకమైన ఘట్టాలలో ఒకదానిని హృద్యంగా తిరిగి చెప్పిన కథ.
● రియల్ హీరోలకు శక్తివంతమైన నివాళి: తరచుగా వార్తల్లోకి రాని ధైర్యసాహసాలు ప్రదర్శించిన నర్సులు, వార్డ్ బాయ్స్, ఇతర ఆసుపత్రి సిబ్బందిని కీర్తిస్తుంది.
● ఆకట్టుకునే కొత్త అవతారంలో కంగనా రనౌత్: భావోద్వేగభరితమైన కథలో గిరిజా ఓక్, స్మిత తాంబేలతో పాటు అద్భుతమైన తారాగణానికి నాయకత్వం వహిస్తున్నారు.
● భయంపై ధైర్యసాహసాల కథ: కేవలం ఒక థ్రిల్లర్ కంటే ఎక్కువగా, ఈ చిత్రం దృఢత్వం, త్యాగం, నిరంతర మానవ స్ఫూర్తిని హృద్యంగా గుర్తుచేస్తుంది.
● ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు తప్పక చూడాల్సిన చిత్రం.
జీ 5 హిందీ బిజినెస్ హెడ్, టీవీ చీఫ్ ఛానల్ ఆఫీసర్ కావేరి దాస్ మాట్లాడుతూ .. ‘ప్రతి శక్తివంతమైన కథకు మూలం దానిని విభిన్నంగా చెప్పే ధైర్యమే. ‘భారత్ భాగ్య విధాత’ ఆ స్ఫూర్తికి ప్రతిరూపం. ఇది జీ 5 హిందీ ఛానెల్ అందిస్తున్న ధైర్యవంతమైన, అర్థవంతమైన కథల పరంపరలో ఒక ముఖ్యమైన చేర్పుగా నిలుస్తుంది. 26/11 సంఘటనలను అనేక కోణాల నుండి వివరించినప్పటికీ, ఈ చిత్రం కామా ఆసుపత్రికి చెందిన వైద్యులు, నర్సులు, వార్డ్ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తల అసాధారణ ధైర్యాన్ని వెలుగులోకి తీసుకుస్తుంది.
వారు స్వార్థం కన్నా మానవత్వానికి, భయం కన్నా కర్తవ్యానికి ప్రాధాన్యతనిచ్చారు. వారి నిశ్శబ్ద ధైర్యసాహసాలు స్థైర్యం, కరుణ, నిస్వార్థతకు శక్తివంతమైన నిదర్శనంగా నిలుస్తాయి. స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్న ఈ తరుణంలో నిజమైన వీరత్వం తరచుగా యుద్ధభూమికి దూరంగానే కనిపిస్తుందని మనకు గుర్తుచేసే అజ్ఞాత వీరులను గౌరవిస్తూ, ఈ స్ఫూర్తిదాయకమైన కథను జీ 5 హిందీ ఛానెల్‌లో ప్రేక్షకులకు అందించడం మాకు గర్వకారణం’అని అన్నారు.
నటి, నిర్మాత కంగనా రనౌత్ మాట్లాడుతూ .. ‘కొన్ని కథలు మనల్ని వెతుక్కుంటూ వస్తాయి ఎందుకంటే అవి ప్రపంచానికి తెలియాల్సినవి. ‘భారత్ భాగ్య విధాత’ అటువంటి చిత్రమే. 26/11 దాడుల సమయంలో ఉగ్రవాదానికి, మానవత్వానికి మధ్య ధైర్యంగా నిలిచిన ఆరోగ్య కార్యకర్తల వెలుగు చూడని కథలను తెరపైకి తీసుకురావడం నటిగానూ, నిర్మాతగానూ నాకు ఎంతో ముఖ్యమైన విషయం. వారి ధైర్యానికి గుర్తింపు పొందాలనే ఆశ కారణం కాదు, వారి అచంచలమైన కర్తవ్య దీక్ష, మానవతా దృక్పథమే దానికి మూలం.
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడం దీని సందేశానికి మరింత అర్థాన్ని చేకూరుస్తుంది; ఎందుకంటే, సరిహద్దుల్లో దేశాన్ని రక్షించేవారే కాకుండా, సంక్షోభ సమయాల్లో అసాధారణ సవాళ్లను ఎదుర్కొనే సామాన్య పౌరులు కూడా భారత స్ఫూర్తికి ప్రతీకలని ఇది మనకు గుర్తుచేస్తుంది. ‘జీ5’ (Zee5)లో ఈ చిత్రాన్ని చూసే ప్రేక్షకులు వారి త్యాగాలతో మమేకమవుతారని, అలాగే ఈ కథకు స్ఫూర్తినిచ్చిన ఎంతోమంది నిజ జీవిత వీరులను గుర్తుచేసుకుంటారని నేను ఆశిస్తున్నాను’ అని అన్నారు.
రచయిత, దర్శకుడు మనోజ్ తపాడియా మాట్లాడుతూ .. ‘26/11 కథను ఇంతకు ముందెన్నడూ చూడని కోణంలో చెప్పాలన్నదే మా ఉద్దేశం. దేశం మన భద్రతా దళాల ధైర్యాన్ని స్మరించుకుంటుండగా, ఆ రాత్రి కామా ఆసుపత్రి లోపల కూడా అంతే అసాధారణమైన ధైర్యసాహసాలు చోటుచేసుకున్నాయి. తమ చుట్టూ అపారమైన ప్రమాదం ఉన్నప్పటికీ వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది తమ రోగులకు చికిత్స కొనసాగించారు. వారి స్థైర్యానికి, మానవత్వానికి, నిశ్శబ్ద వీరత్వానికి ‘భారత్ భాగ్య విధాత’ మా నివాళి. ఈ స్వాతంత్ర్య దినోత్సవం నాడు హిందీ జీ 5 ద్వారా ఈ చిత్రం దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరుతున్నందుకు నేను కృతజ్ఞుడను’ అని అన్నారు.
‘భారత్ భాగ్య విధాత’ ఆగష్టు 14, 2026న హిందీ జీ 5లో ప్రత్యేకంగా ప్రసారం కానుంది.
