పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లిన యువ రైతుకు ప్రమాదవశాత్తు షాక్ కొట్టి మృతి చెందిన సంఘటన మఠంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బక్కమంతుల గూడెం గ్రామానికి చెందిన నిమ్మల నరేష్(29) అనే రైతు మంగళవారం ఉదయం 7 గంటల సమయంలో పొలం కర్గేట్ చేయుట కోసం తన పొలానికి నీరు పెట్టేందుకు వ్యవసాయ మోటార్ వద్దకు వెళ్లాడు.ఈ క్రమంలో అతని పొలంలోనే మోటార్ కు విద్యుత్ సరఫరా చేసే విద్యుత్ తీగ తెగి పొలం కంచెపై పడడంతో దానిని గ్రహించని నరేష్ ఫెన్సింగ్ వైర్ ను పట్టుకోవడంతో అక్కడికక్కడే విద్యుత్ షాక్తో మృతి చెందారు.
మృతునికి భార్య,ఇద్దరు కొడుకులు ఉన్నారు.నరేష్ మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి.ఒక్కానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లితండ్రులు గుండెలు విలేసేలా రోదిస్తున్నారు.నిరుపేద కుటుంబానికి చెందిన నరేష్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని పలువురు కోరారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం.పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని హుజూర్ నగర్ ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
