- ఆసక్తికర కథనం మీకోసం..
- మహారాష్ట్రలోని శని సింగాపురం ఈ గ్రామం..
ధారణంగా మనం వస్తువులను సంపదను భద్ర పరుచుకోవడానికి ఇల్లు కట్టుకుని, భద్రత కోసం తలుపులు, కిటికీలు వంటివి అమర్చుకుంటాం. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు, వేరే ఊరికి వెళ్లేటప్పుడు తలుపులకు భద్రంగా తాళాలు వేస్తాం. అయితే నివాసయోగ్యంగా ఉన్న ఒక్క గ్రామంలో మాత్రం ఇళ్లకు ఎటువంటి తలుపులు ఉండవు. కేవలం ప్రజల ఇళ్లకే కాకుండా పోస్టాఫీసు, ఆసుపత్రి తదితర ప్రభుత్వ భవనాలకు కూడా ఎటువంటి ద్వారాలు ఉండవు. అక్కడ ఉన్న ఒక దైవం తమ సంపదను రక్షిస్తోందన్న నమ్మకమే ఇందుకు కారణం.
గ్రామ చరిత్ర
ఈ గ్రామ చరిత్ర నిన్నమొన్నటిదో, పది, పదిహేనేళ్ల నాటిదో కాదు. కలియుగం ప్రారంభం నుంచి కూడా ఈ గ్రామంలో ఇటువంటి పరిస్థితే నెలకొని ఉంది. ప్రజలు పక్క ఊరికి వెళ్లినా కూడా ఇంటికి తలుపులను బిగించి వెళ్లరు. తలుపులే లేనప్పుడు ఇక దానికి గొళ్లెం, తాళాల ఊసు అసలే లేదు. ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచుతున్న ఈ ఘనత వహించిన గ్రామం మన దేశంలోనే ఉంది. ఆ గ్రామం ఏమిటి ఎక్కడ ఉంది, గ్రామం విశిష్టతలు తదితర విషయాలు..
అనంత స్వరూపడని చెప్పే క్రమంలోనే
మహారాష్ట్రలోని, శని శింగనాపుర్లో ఉన్న ఈ ఆలయం శని దేవుని ముఖ్య పుణ్యక్షేత్రం. ఇక్కడ ఆ పరమాత్ముడు ఆరుబయటనే వెలసి ఉంటాడు. ఇక్కడ శని భగవానునికి ఎటువంటి ప్రత్యేక దేవాలయం ఉండకపోవడం ఇక్కడ ఉన్న విశిష్టత. తాను అనంత స్వరూపడని ప్రజలకు తెలియజేసే క్రమంలోనే శనీశ్వరుడు తనకు దేవాలయం అవసరం లేదని ఇక్కడి వారికి చెప్పినట్లు స్థానిక కథనం ద్వారా తెలుస్తోంది.
స్వయంభువుడు
శని శింగనాపుర్ అనే గ్రామం మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేతమైన షిరిడి నగరానికి, ఔరంగాబాద్ నగరానికి మధ్యలో నెలకొని ఉంది. ఇక్కడి శనిదేవుడు స్వయంభువుగా వెలసినట్లుగా ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. ఇక్కడ వెలసి ఉన్న శనిదేవుని నల్లని, గంభీరమైన రాతి విగ్రహం, ఏ కాలానికి చెందినదో కచ్చితంగా ఎవరికీ తెలియదు.
