- జేఎన్టీయూహెచ్ ఆర్ అండ్ డీ సెల్ డైరెక్టర్ డా. టి. సత్య సావిత్రికి వినతి..
- వినతిపత్రం సమర్పించిన పీహెచ్దీ స్కేఅలర్ పితాని సందీప్ గౌడ్..
బుధవారం జేఎన్టీయూహెచ్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెల్ డైరెక్టర్ డా. టి. సత్య సావిత్రిని కలిసి, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన పార్ట్‌టైమ్ పీహెచ్డీ స్కాలర్ జవ్వాజీ దిలీప్ (హాల్ టికెట్ నెం. 2301203003) కు సంబంధించిన పలు అంశాలపై సమగ్ర విచారణ జరిపి, యూనివర్సిటీ నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పీహెచ్డీ స్కాలర్ పితాని సందీప్ గౌడ్ వినతిపత్రం సమర్పించడం జరిగింది.
వినతిపత్రంలో ప్రధానంగా, పార్ట్‌టైమ్ పీహెచ్డీ ప్రవేశ సమయంలో సమర్పించిన ఎన్.ఓ.సి., ఉద్యోగ సంబంధిత పత్రాల ప్రామాణికతను పరిశీలించాలని, ప్రవేశం పొందిన నాటి నుండి ఇప్పటి వరకు ఆయన నిజంగా ఉద్యోగంలో కొనసాగుతున్నారా లేదా అధికారికంగా ధృవీకరించాలని కోరడం జరిగింది.. అవసరమైతే సంబంధిత సంస్థ నుండి పే స్లిప్స్, బ్యాంక్ స్టేట్మెంట్లు, ఫారం16, ఆఫర్ లెటర్, ఉద్యోగ ధృవీకరణ పత్రాలు పరిశీలించి పార్ట్‌టైమ్ పీహెచ్డీ నిబంధనలు పాటించబడుతున్నాయా లేదా నిర్ధారించాలని విజ్ఞప్తి చేశారు..

అలాగే, యూనివర్సిటీలో పార్ట్‌టైమ్ పీహెచ్డీ స్కాలర్‌గా ఉంటూ రోజంతా క్యాంపస్‌లో గడపడం, వివిధ విద్యార్థి కార్యక్రమాల్లో పాల్గొనడం, ఇటీవల అనేక అంశాలపై జరిగిన ఆందోళనల నేపథ్యంలో ఆయన పాత్రపై వచ్చిన ఫిర్యాదులను అధికారిక రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్ మరియు ఇతర ఆధారాల ఆధారంగా నిష్పాక్షికంగా విచారించాలని కోరారు.. ఇంకా, 31-01-2026 తేదీన అప్పటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం జారీ చేసిన షోకాజ్ నోటీసు ప్రస్తుత స్థితి ఏమిటి, దానిపై ఎలాంటి విచారణ జరిగిందో, ఎలాంటి చర్యలు తీసుకున్నారో వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు..
దిలీప్ పీహెచ్దీ ప్రవేశ సమయంలో అప్పటి ఆర్ అండ్ డీ డైరెక్టర్, పీహెచ్దీ గైడ్/సూపర్వైజర్ డా. కె. విజయ కుమార్ రెడ్డి కాలంలో సమర్పించిన పత్రాలు పూర్తిగా పరిశీలించబడ్డాయా, అనంతరం డైరెక్టర్లుగా పనిచేసిన డా. ఎస్. వెంకటేశ్వరరావు, ప్రొఫెసర్ వి. కామాక్షి ప్రసాద్, డా. చెన్నకేశవ రెడ్డి కాలంలో ఈ అంశాలపై వచ్చిన ఫిర్యాదులపై ఎందుకు చర్యలు తీసుకోలేదనే విషయాలను కూడా పరిశీలించాలని కోరారు..
జేఎన్టీయూహెచ్ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయంలో పరిశోధన ప్రమాణాలు, అకడమిక్ క్రమశిక్షణ, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ అంశాలపై పూర్తిస్థాయి, నిష్పాక్షిక విచారణ జరిపి, వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి యూనివర్సిటీ నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని విశ్వ విద్యార్ధుల విద్యార్థులుగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెల్‌ను వారు వినతిపత్రంలో కోరారు.. ఈ కార్యక్రమంలో పరిశోధక విద్యార్ది చల్ల రామకృష్ణ రెడ్డి, ఇంజనీరింగ్ విద్యార్థులు జయరాం, సాయిరాం, విశ్వజిత్, మనీష్, అభినవ్ తదితరులు పాల్గొన్నారు.
